కీర్తి సురేష్‌తో మహేష్ కోనేరు మూవీ

265
keerthi suresh

మహానటితో ప్రేక్షకులను మెప్పించిన హీరోయిన్ కీర్తి సురేష్‌. ఈ సినిమాలో సావిత్రిగా ఒదిగిపోయింది కీర్తి.తనదైన నటనతో సావిత్రిని మరిపించింది. తాజాగా మరోసారి లేడి ఓరియెంటెడ్ పాత్రలో కనిపించేందుకు సిద్ధమైంది.

కీర్తిసురేష్ ప్రధాన పాత్రలో ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై తెరకెక్కే కొత్త చిత్రం హైదరాబాద్‌లోని అన్నపూర్ణ సెవెన్ ఏకర్స్‌లో ప్రారంభమైంది. నరేంద్ర దర్శకత్వంలో మహేష్ కోనేరు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి నందమూరి కల్యాణ్‌రామ్ క్లాప్ కొట్టగా…హరీష్ శంకర్ గౌరవ దర్శకత్వం వహించారు.

ఈ సందర్భంగా జరిగిన మీడియా సమావేశంలో కీర్తిసురేష్ మాట్లాడుతూ తెలుగులో ‘మహానటి’ తర్వాత నటిస్తున్న సినిమా ఇది. మహిళా ప్రధానమైన చిత్రంలో నటిస్తుండడంతో చాలా సంతోషంగా ఉంది. ప్రతి అమ్మాయికి కనెక్ట్ అయ్యే సినిమా ఇది అన్నారు.

దర్శకుడు నరేంద్ర మాట్లాడుతూ 2016 నుండి ఈ కథపై వర్క్ చేస్తున్నాను. అన్ని భావోద్వేగాలు కలగలిసిన కథ ఇది. ఈ కథకు కీర్తిసురేష్ తప్ప మరెవరూ సరిపోరు. 25 శాతం ఇండియాలో 75 శాతం యుఎస్‌లో చిత్రీకరణ జరుగనుంది. ఏప్రిల్‌లో యుఎస్ షెడ్యూల్‌ను ప్లాన్ చేస్తున్నాం. ఫిబ్రవరిలో షూటింగ్ ప్రారంభమవుతుందన్నారు.