రాణించిన కోహ్లీ…విఫలమైన పుజారా

619
- Advertisement -

కింగ్‌స్టన్ వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టు తొలిరోజు భారత్‌ గౌరవప్రదమైన స్కోరు సాధించింది. మరోసారి విరాట్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడటం..మయాంక్ అగర్వాల్ రాణించడంతో భారత్ ఫస్ట్ డే ఆటముగిసే సమయానికి 90 ఓవర్లలో 5 వికెట్లు కొల్పోయి 264 పరుగులు చేసింది.

కోహ్లీ(76), ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్‌(55) హాఫ్ సెంచరీలతో ఆకట్టుకున్నారు. ఇక తొలి టెస్టులో విఫలమైన పుజారా(6) ఈ మ్యాచ్‌లోనూ విఫలమయ్యాడు. ప్రస్తుతం హనుమ విహారి(42 బ్యాటింగ్‌), రిషబ్‌ పంత్‌(27 బ్యాటింగ్‌) క్రీజులో ఉన్నారు.

ఈ మ్యాచ్ ద్వారా విండీస్ భారీకాయుడు రకీమ్‌ కార్న్‌వాల్‌ అరంగేట్రం చేశాడు. 6.6 అడుగుల ఈ ఆఫ్‌స్పిన్‌ ఆల్‌రౌండర్‌ బరువు ఏకంగా 140 కిలోలు. టెస్టు క్రికెట్‌ ఆడిన అత్యంత బరువైన క్రికెటర్‌గా రికార్డు సృష్టించాడు.

- Advertisement -