యూత్‌ గుండెల్లో ఆర్డీఎక్స్‌ పేల్చేసిన… పాయల్‌

815
rdx love
- Advertisement -

పాయల్ రాజ్‌పుత్, తేజస్ కంచెర్ల ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న చిత్రం `RDX లవ్`. నరేశ్, ఆమని, ముమైత్ ఖాన్, విద్యుల్లేఖా రామన్, నాగినీడు, ఆదిత్య మీనన్ తదితరులు కీలక పాత్ర ధారులు. శంకర్ భాను దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతుండగా రామ్ మునీష్ సమర్పణలో హ్యపీ మూవీస్ బ్యానర్‌పై సి.కల్యాణ్ నిర్మిస్తున్నారు.

తాజాగా సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాల్లో ట్రైలర్‌ని విడుదల చేసిన చిత్రయూనిట్ ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టేసింది. సేఫ్టీలు, స్వర్గం కనిపిస్తుందంటూ రొమాన్స్ డోస్ పెంచేసిన పాయల్… ఇంట్లో పేరెంట్స్ లేనప్పుడు మన ఒంట్లో ఫీలింగ్స్ అదుపులో పెట్టుకోవాలి.. తప్పదు అనుకుంటే సేఫ్టీలైనా అందుబాటులో ఉంచుకోవాలి అనే డైలాగ్ కుర్రకారుకు స్పెషల్ కిక్ ఇచ్చింది. అలా ముద్దు పెట్టుకుంటే బాగుంటుందా అని ఓ అమ్మాయి అడగ్గా.. స్వర్గం కనిపిస్తుంది అని అబ్బాయి చెప్పడం, ఇలా ఇంకా ఎన్నో డైలాగులతో ‘RDX లవ్’ టీజర్ పరేషాన్ చేసింది. విడుదలైన ఒక్కరోజులోనే 20 లక్షల డిజిటల్ వ్యూస్ రాబట్టి సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది.

- Advertisement -