ఐపీఎల్ చరిత్రలో మరో అరుదైన రికార్డుకు చేరువలో ఉన్నారు విరాట్ కోహ్లీ . ఇప్పటికే 291 సిక్సులు కొట్టిన కోహ్లీ, మరో 9 సిక్సులు కొడితే 300 సిక్సుల క్లబ్‌లో చేరనున్నారు. ఈ ప్రత్యేక జాబితాలో ఇప్పటికే క్రిస్ గేల్(357 సిక్సులు), రోహిత్ శర్మ (302 సిక్సులు) ఉన్నారు.
ఇక ఈ జాబితాలో నాలుగో స్థానంలో ధోని (264 సిక్సులు), ఐదో స్థానంలో డివిలియర్స్ (251 సిక్సులు) ఉన్నారు. ఈ నేపథ్యంలో కోహ్లీ ఈ సీజన్‌లోనే ఈ మైలురాయిని అందుకోవడం ఖాయమని అభిమానులు ఆశిస్తున్నారు.
ఐపీఎల్‌లో అత్యధిక సిక్సులు:
క్రిస్ గేల్ – 357
రోహిత్ శర్మ – 302
విరాట్ కోహ్లీ – 291
ఎంఎస్ ధోని – 264
ఏబీ డివిలియర్స్ – 251
ఇదిలా ఉండగా, IPL 2026 ప్రారంభ వేడుకలపై కీలక నిర్ణయం తీసుకున్నారు. బెంగళూరులోని చిదంబరం స్టేడియంలో ఈసారి ఓపెనింగ్ సెరిమనీ నిర్వహించరని బీసీసీఐ ప్రకటించింది. గత ఏడాది జూన్ 4న జరిగిన విషాద ఘటనకు గౌరవ సూచకంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీసీసీఐ కార్యదర్శి దేవ్‌జిత్ తెలిపారు.
Also Read:IPL: క్యాచ్‌లపై కొత్త కఠిన నిబంధనలు!
అయితే, ఐపీఎల్ ముగింపు రోజు (మే 31)న గ్రాండ్ క్లోజింగ్ సెరిమనీ నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. డిఫెండింగ్ చాంపియన్స్ ఆర్సీబీ.. తమ తొలి మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌తో తలపడనుంది.

