కోహ్లీకి రూ.12 లక్షల జరిమానా…

158
Virat Kohli has been fined Rs 12 lakh
- Advertisement -

ఐపీఎల్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీకి రూ.12 లక్షల జరిమానా విధించింది ఐపీఎల్ యాజమాన్యం. బుధవారం చెన్నైతో జరిగిన మ్యాచ్‎లో స్లో ఓవర్ రేటు నమోదు కావడంతో కోహ్లీకి జరిమానా విధించారు. ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకారం నిర్ణీత సమయంలోగా ఓవర్లు పూర్తి కావాలి… కానీ నిన్నటి మ్యాచ్‎లో ఆర్సీబీ నిర్ణీత సమయంలో ఓవర్లు  పూర్తి చేయనందున జరిమానా విధిస్తున్నామని ఐపీఎల్ యాజమాన్యం తెలిపింది.

Virat Kohli has been fined Rs 12 lakh

మొదట బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ డికాక్(53), ఏబీ డివిలియర్స్(68) రాణించడంతో 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. భారీ లక్ష్యఛేదనతో బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్ అంబటి రాయుడు(82), మహేంద్రసింగ్ ధోని(70 నాటౌట్) విజృంభించడంతో రెండు బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని నమోదు చేసింది. ఇప్పటికే ఆరు మ్యాచ్‎లు ఆడిన ఆర్సీబీ రెండింటిలో మాత్రమే విజయం సాధించింది. మరోవైపు చెన్నైఆరు మ్యాచులకు ఐదింటిలో విజయం సాధించి  పాయింట్ల పట్టికలో  మొదటి స్థానంలో ఉంది. ఆర్సీబీ 6వ  స్థానంలో ఉంది.

- Advertisement -