రాహుల్ తెవాటియాకు కోహ్లీ కానుక..

111
kohli

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు రాహుల్ తెవాటియాకు గుర్తుండిపోయే కానుక ఇచ్చాడు. ఐపీఎల్ తాజా సీజన్‌లో రాహుల్ తెవాటియా ఒక్కసారిగా స్టార్ ఇమేజ్ అందుకున్నాడు. కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఒకే ఓవర్‌లో ఐదు సిక్సర్లు బాది సంచలనం సృష్టించాడు. ఆ మ్యాచ్‌లో మొదట నత్తనడకన బ్యాటింగ్ చేసి అందరూ విసుగు చెందేలా చేసిన ఎడమచేతివాటం తెవాటియా ఆపై ఒక్కసారిగా వేగం పెంచి విధ్వంసం సృష్టించాడు.

ఆ ఇన్నింగ్స్ తో విరాట్‌ తెవాటీయాకు అభిమానిగా మరిపోయాడు. అందుకే కోహ్లీ తన జెర్సీని తెవాటియాకు కానుకగా ఇచ్చాడు. ఆ జెర్సీపై డియర్ రాహుల్… బెస్ట్ విషెస్ అని రాసి బహూకరించాడు. నిన్న సాయంత్రం బెంగళూరు, రాజస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లోనూ తెవాటియా మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. 12 బంతుల్లో 3 భారీ సిక్సర్లతో 24 పరుగులు చేశాడు. దాంతో కోహ్లీ… తెవాటియాకు ఫిదా అయిపోయాడు.