మొక్కలు నాటిన ప్రముఖ కన్నడ హీరో రక్షిత్ శెట్టి..

131
Rakshith Shetty

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ఇచ్చిన ఛాలెంజ్‌ను స్వీకరించిన ప్రముఖ కన్నడ నటుడు రక్షిత్ శెట్టి నేడు బెంగళూరులోని ఆయన నివాసంలో మొక్కలు నాటారు.

ఈ సందర్భంగా రక్షిత్ శెట్టి మాట్లాడుతూ.. భవిష్యత్ తరాల కోసం మనందరం బాధ్యతగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలి అని కోరారు. ఇంత మంచి కార్యక్రమం చేపట్టి దేశవ్యాప్తంగా మొక్కలు నాటి ఇస్తున్న రాజ్యసభ సభ్యులు సంతోష్ గారికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా మరొక ఐదుగురిని హీరో బాబిసింహ, దర్శకులు రిషబ్ శెట్టి, నిర్మాత పుష్కర మల్లికార్జున్, నిర్మాత కార్తీక్ గౌడ్, హీరో నివిన్ పాయల్ లను గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.