విరాట్ కోహ్లీ….టీమిండియా కెప్టెన్‌గానే కాదు తన హవాభావాలతో క్రికెట్ ఫ్యాన్స్‌ను ఎప్పుడు మెప్పిస్తునే ఉంటాడు. ముఖ్యంగా గ్రౌండ్‌లో ఉన్నాడంటే విరాట్‌ను అదుపుచేయడం కష్టం. తనను తానే మర్చిపోయే కోహ్లీ…తన హవాభావాల ద్వారా ఏం చెప్పాలనుకుంటాడో సూటిగా చెప్పేస్తాడు.
తాజాగా ఆడిలైడ్ వేదికగా ఆసీస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో కోహ్లీ..ఫించ్ వికెట్‌ను ఇషాంత్ పడగొట్టానే తనదైన శైలీలో రెచ్చిపోయాడు. తాజాగా మూడో రోజు ఆట ప్రారంభించడానికి ముందు వర్షం పడింది. వర్షం తగ్గిన తర్వాత అందరూ తిరిగి మైదానంలోకి చేరుకున్నారు. ఆట ప్రారంభం కాబోతుండగా కోహ్లీ ఓ చోట నిలబడి డ్యాన్స్ చేశాడు. ఈ వీడియోను క్రికెట్ ఆస్ట్రేలియా ట్విటర్‌లో పంచుకుంది. దీంతో ఈ వీడియో వైరల్ అవుతోంది.
ఇక ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 235 పరుగులకు ఆలౌట్ కాగా భారత్ రెండో ఇన్నింగ్స్ లో రెండు వికెట్లు కొల్పోయి 115 పరుగులు చేసింది.
Virat's loving it… #AUSvIND pic.twitter.com/JV0lxo4Aen
— cricket.com.au (@cricketcomau) December 8, 2018