రోడ్డుపై బ్యాలెట్ బాక్స్..

203
rajasthan
- Advertisement -

5 రాష్ట్రాల ఎన్నికల్లో భాగంగా రాజస్థాన్,తెలంగాణలో నిన్న పోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే. రాజస్థాన్‌లో 75 శాతం,తెలంగాణలో 69.1 శాతం పోలింగ్ నమోదైంది. అభ్యర్థుల భవితవ్యం బ్యాలెట్ బాక్స్‌పలో నిక్షిప్తమై ఉంది. వీటిని కాపాడాల్సిన అధికారుల నిర్లక్ష్యం కారణంగా రోడ్డుపై దొరికింది బ్యాలెట్ బాక్స్.

రాజస్థాన్‌లోని బరాన్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. కిషన్‌గంజ్ నియోజకవర్గంలోని షాహాబాద్‌లో బ్యాలెట్ యూనిట్లను స్ట్రాంగ్ రూమ్‌కు తరలిస్తుండగా.. ఒక బ్యాలెట్ యూనిట్ రోడ్డుపై పడిపోయింది. అయితే అధికారులు పట్టించుకోలేదు.

బ్యాలెట్ యూనిట్ రోడ్డుపై పడిపోయి ఉండటాన్ని గమనించిన పోలీసులు.. దాన్ని ఆ తర్వాత స్ట్రాంగ్ రూమ్‌కు తరలించారు. ఎన్నికల విధుల్లో అలసత్వం ప్రదర్శించిన ఇద్దరు అధికారులపై వేటు పడింది.

- Advertisement -