క్రికెట్ ప్రపంచంలో మాస్టర్ బ్లాస్టర్ రికార్డులను తిరగరాసే వ్యక్తి భారతీయుడై ఉండాలి గతంలో ఓ ఇంటర్వ్యూ సందర్భంగా సచిన్ టెండూల్కర్ అన్నారు. ఇప్పుడు అదే విషయాన్ని నిజం చేయనున్నారు విరాట్ కొహ్లి. అవును ఇది నిజం…విరాట్ కొహ్లి రికార్డులను తిరగరాస్తున్నాడు. అందులో భాగంగానే వన్డేలలో అత్యధిక సెంచరీలను ఈ యేడాది ముగిసే నాటికి వంద సెంచరీలను పూర్తిచేసే అవకాశాలు ఉన్నాయని ప్రముఖ క్రికెట్ విశ్లేషుకులు అంచనా వేస్తున్నారు.
శ్రీలంకతో జరిగిన మూడు వన్డే సిరీస్‌లో భాగంగా మొదటి వన్డేలో శతకం సాధించారు. మొత్తంగా వన్డేల్లో 45వ అంతర్జాతీయ క్రికెట్‌లో (అన్ని పార్మాట్లు) 73వ శతకం సాధించారు. అంతేకాదు స్వదేశంలో 20 సెంచరీల మైలు రాలు దాటిన రెండో బ్యాటర్‌గా నిలిచారు.
స్వదేశంలో తక్కువ ఇన్నింగ్స్‌లో 20 సెంచరీలు సాధించిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. దీంతో ఈ ఫీట్ కేవలం 99ఇన్నింగ్స్‌లో సాధించారు. సచిన్ టెండూల్కర్ 20సెంచరీలకు గాను 160ఇన్నింగ్స్‌లు తీసుకున్నారు. ఒకే జట్టు మీద అత్యధిక సెంచరీలతో సచిన్ రికార్డును కోహ్లీ సమం చేశాడు.
శ్రీలంక, వెస్టిండీస్ జట్ల మీద 9 సార్లు అతను వంద పరుగులు చేశాడు. సచిన్, ఆస్ట్రేలియా మీద 9 సెంచరీలు కొట్టాడు. రోహిత్ శర్మ, ఆసీస్‌పై 8 సెంచరీలతో మూడో స్థానంలో ఉన్నాడు. 80 బంతుల్లోనే 11 ఫోర్లు 1 సిక్సర్‌తో సెంచరీకి చేరువయ్యాడు. దాంతో టీమిండియా 373 రన్స్ చేసి, లంక ముందు కొండంత లక్ష్యాన్ని పెట్టింది.
Back to back ODI hundreds for @imVkohli 👏👏
Live – https://t.co/MB6gfx9iRy #INDvSL @mastercardindia pic.twitter.com/Crmm45NLNq
— BCCI (@BCCI) January 10, 2023
ఇవి కూడా చదవండి…