వేగాన్‌గా మారిన కోహ్లీ ఎప్పుడంటే…

83
- Advertisement -

విరాట్ కోహ్లీ అంటే ప్రస్తుత తరంలోని ప్రజలందరికీ తెలుసు. దానికి కారణం అతని ఆటతీరు అందరీ చూపు తనవైపు తిప్పుకునేలా చేస్తాడు. ఆలాంటి ఆటగాడు వెజిటేరియన్‌ అంటే నమ్ముతారా…నమ్మాలి ఇది నిజం. ముఖ్యంగా క్రీడాకారులు మాంసాహారంను కూడా తమ దినచర్యలో భాగంగా తీసుకుంటారు. ఎందుకంటే ఆటల్లో పాల్గొన్నప్పుడు ఎక్కువగా శారీరక శ్రమ పడాల్సి ఉంటుంది. అందుకే ప్రోటీన్లు ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకొవాడానికి ప్రయత్నిస్తారు. కానీ విరాట్‌కోహ్లీ శాఖాహారిగా మారిపోయాడు. ఎప్పుడో తెలుసా…2018.

విరాట్ గతంలో ఓ ఇంటర్వ్యూలో సందర్భంగా  వెజిటేరియన్‌గా మారిన విషయం తెలిపాడు. 2018లో దక్షిణాఫ్రికా టూర్‌లో భాగంగా సెంచూరియన్‌ టెస్ట్‌ సందర్భంగా తను ఆనారోగ్యానికి గురైనట్టు తెలిపారు. ఆ సమయంలో వెన్నెముక సమస్య అధికంగా వేదించిందని దానికి తోడుగా యూరిక్ యాసిడ్, జీర్ణాశయంలో విపరీతమైన నొప్పి వల్ల సరిగ్గా ఆడలేకపోయినట్టు తెలిపారు. ఆ సమయంలో నా ఎముకల్లో ఉండే కాల్షియం మొత్తం తగ్గిపోయిందని అందువల్లే వెన్నెముక సమస్య వచ్చిందని డాక్టర్లు దృవీకరించినట్టు తెలిపారు. ఇక అప్పటి నుంచి శాఖాహారిగా మారిపోయినట్టు తెలిపారు.

మరోక సందర్భంలో ఇంటర్వ్యూలో నేను రోజు కూరగాయలు, రెండు కప్పుల కాఫీ, క్వినోవా, పాలకూర, దోసెలు ఇష్టంగా తింటా అని మరియు వాటిని కూడా నియంత్రిత పరిమాణంలో తీసుకుంటానని తెలిపారు. ఇదంతా ఇప్పుడు ఎందుకంటే శ్రీలంకతో జరిగిన మూడు వన్డేల్లో భాగంగా సెంచరీలు చేసి అందరి చూపు తనవైపుకు తిప్పకున్నారు. ఈ సందర్భంగా కోహ్లీపై ప్రశంసల వర్షం కురుస్తుంది. త్వరలో సచిన్‌ రికార్డు తిరగరాసి కొత్త రికార్డు సృష్టిస్తారని ప్రశంసిస్తున్నారు. గత మ్యాచ్‌లో విరాట్‌ 166 పరుగులు చేసిన విషయం తెలిసిందే.

ఇవి కూడా చదవండి…

విరాట్ అలా చేస్తే సాధిస్తాడు…సన్నీ

వైకొమ్‌కు మహిళా ఐపీఎల్ హక్కులు..

వివేక్ ఎక్స్‌ప్రెస్‌ దూరమెంతో తెలుసా…

- Advertisement -