సచిన్ రికార్డును బ్రేక్ చేసిన విరాట్..

108
kohli

భారత పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ….సచిన్ టెండూల్కర్ రికార్డును బ్రేక్ చేశాడు. వన్డేల్లో అత్యంత వేగంగా 12 వేల పరుగులు సాధించిన క్రికెటర్‌గా రికార్డు సృష్టించాడు. కేవ‌లం 251 వ‌న్డేల్లో 242వ‌ ఇన్నింగ్స్‌లో ఈ ఫీట్‌ను అందుకున్నాడు. క్యాన్‌బెరాలో ఆస్ట్రేలియాతో జ‌రుగుతున్న మూడో వ‌న్డేల్లో విరాట్‌.. ఈ రికార్డును న‌మోదు చేశాడు.

వ‌న్డేల్లో విరాట్ కోహ్లీ బ్యాటింగ్ యావ‌రేజ్ 59.41గా ఉండగా ఇందులో 43 సెంచ‌రీలు ఉన్నాయి. స‌చిన్ 300, పాంటింగ్ 314, సంగ‌క్క‌ర 336, జ‌య‌సూర్య 379వ ఇన్నింగ్స్‌లో 12 వేల ప‌రుగుల మైలురాయిని దాటారు. వ‌న్డేల్లో అత్యంత వేగంగా 8వేలు, 9 వేలు, ప‌ది వేలు, 11 వేల ప‌రుగులు సాధించిన క్రికెట‌ర్‌గా కూడా కోహ్లీ రికార్డు క్రియేట్ చేశాడు.