గ్యాస్ సిలిండర్‌పై రూ. 50 పెంపు

207
gas

సామాన్యుల నెత్తిన పెనుభారం మోపాయి చమురు కంపెనీలు. రాయితీ గ్యాస్‌ సిలిండర్‌‌ ధరలను భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి దేశీయ చమురు కంపెనీలు. ఒక్కో సిలిండర్‌పై రూ.50 భారం పడనుండగా ఢిల్లీలో రాయితీ సిలిండర్‌ ధర రూ.594 నుంచి రూ.644కు పెరిగింది. పెరిగిన ధరలు వెంటనే అమల్లోకి వస్తాయని చమురు కంపెనీలు ప్రకటించాయి.

అయితే దేశంలోని ఒక్కో రాష్ట్రంలో ఎల్పీజీ ధరలు ఒక్కో రకంగా ఉండటంతో సిలిండర్‌ ధరల్లో హెచ్చు తగ్గులు ఉంటాయి. హైదరాబాద్‌లో సిలిండర్‌ ధర రూ.646.50గా ఉండగా తాజా పెంపుతో రూ.696.5కు చేరే అవకాశం ఉంది.