అమెరికాలో భూకంపం..

119
america

అమెరికాలో భూకంపం సంభవించింది. నెవాడాలోని మినాకు దక్షిణానికి 24 కిలోమీటర్ల వేగంతో 5.2 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు యూఎస్‌ జియోలాజికల్ సర్వే (యూఎస్‌జీఎస్‌) తెలిపింది. మంగళవారం రాత్రి 11.23గంటల ప్రాంతంలో జీఎంటీ వద్ద ప్రకంపనలు సంభవించాయని పేర్కొంది.

భూప్రకంపనలతో ప్రజలు భయాందోళనలు చెందారు. ఈ భూకంపం వల్ల ఆస్తినష్టం, ప్రాణనష్టంపై సమాచారం అందలేదు. భూకంప కేంద్రం, 10.2 కిలోమీటర్ల లోతుతో గుర్తించినట్లు జియోలాజికల్‌ సర్వే అధికారులు పేర్కొన్నారు.