కోహ్లీ, అనుష్క ప్రేమాయణం నాలుగేళ్ల నుండి నడుస్తుంది. ఓ షాంపూ ప్రకటనలో తొలిసారిగా కలుసుకున్న వీరిద్దరు అప్పుడే మనసులు ఇచ్చిపుచ్చుకున్నారు. అప్పటి నుంచే ప్రేమ చిగురించి విడదీయరాని బంధంగా మారినా కొత్తలో ఈ జంట తమ వ్యవహా రాన్ని చాలా గుట్టుగా ఉంచింది. ఎవరికంటా పడకుండా కలుసుకోవడంపైనే దృష్టి పెట్టింది. అయితే మాజీ పేసర్ జహీర్‌ఖాన్ సలహాతో తమ అనుబంధాన్ని అధికారి కంగానే లోకానికి బహిర్గతపరిచింది ఈ జంట. అప్పటి నుంచి ప్రేమ పక్షులుగా స్వేచ్ఛగా విహరించగా అప్పుడ ప్పుడు అనుష్క మైదానంలో కూర్చుని కోహ్లీని ఉత్తేజ పరిచిన సంఘటనలూ ఉన్నాయి. ఇక ఇప్పుడు వీరు వివాహబంధంతో ఒక్కటవుతున్నారన్న వార్త హల్‌చల్ చేస్తుంది. అందరికీ భిన్నంగా ఈ కపుల్ డెస్టినేషన్ వెడ్డింగ్ వైపు మొగ్గుచూపడంతో మరింత ఆసక్తి పెరిగింది.
మరో రెండు రోజుల్లో ఒకటికానున్న సెలబ్రిటీ జంట ను ఆశీర్వదించేందుకు బాలీవుడ్ హీరోలు షారూక్ ఖాన్, అమీర్ ఖాన్ లతో పాటు హీరోయిన్ దీపికా పదుకొనే,బ్యాటింగ్ దిగ్గజం సచిన్, యువరాజ్ సింగ్‌లు ఇటలీకి బయలుదేరుతున్నారు. వీరిద్దరి పెళ్లికీ అతిథులుగా హాజరుకానున్న వీరు, సంగీత్ కార్యక్రమం నుంచే ఉంటారని, మూడు రోజులూ ఇటలీలో బస చేయనున్నారని తెలుస్తోంది. వీరితో పాటు అనుష్క స్నేహితుల్లో ఒకరైన ఆదిత్య చోప్రా కూడా లండన్ వెళ్లనున్నాడు. ఇక అనుష్క తండ్రి అజయ్ కుమార్ శర్మ, తన ఇంటి చుట్టుపక్కల వారిని, బంధువులను పెళ్లికి రావాలని కోరుతూ ఆహ్వాన పత్రాలు కూడా పంచినట్టు సమాచారం.