దీపావళీ వేడుకల్లో విరుష్క దంపతులు

489
virat Anushka
- Advertisement -

టీంఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లి, అనుష్క దంపతులు దీపావళి పండుగను గ్రాండ్ గా సెలబ్రెట్ చేసుకున్నారు. పండుగ సందర్భంగా సాంప్రదాయ దుస్తులు ధరించి ఫోటోలకు ఫోజులిచ్చారు. ట్వీట్టర్ ద్వారా అభిమానులకు దీపావళి శుభాకాంక్షాలు తెలిపారు. కోహ్లి ట్వీట్టర్ ద్వారా స్పందిస్తూ.. అందరికీ హ్యాపీ దీవాళీ, ఈ పండుగ సందర్భంగా ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నిండాలని, అందరూ ప్రశాంతంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు.

మరోవైపు అనుష్క కూడా ట్వీట్టర్ ద్వారా దీపావళి శుభాకాంక్షాలు తెలియజేసింది. మా తరఫున మీకు, మీ కుంటుంబ సభ్యులందరికీ దీపావళి శుభాకాంక్షలు అని తెలిపిన అనుష్క.. అందరి జీవితాల్లో వెలుగులు నిండాలని కోరారు. విరాట్ కోహ్లి, అనుష్క జంట ఆనందంగా ఉండటం చూసి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాగా వచ్చె నెల 3వ తేది నుంచి బంగ్లాదేశ్ తో జరిగే టీ20 సీరిస్ కు కోహ్లి దూరంగా ఉండనున్నారు. అతని స్ధానంలో వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టనున్నారు.

- Advertisement -