బిగ్ బాస్ హౌస్ లో సందడి చేసిన యాంకర్ సుమ

467
Suma In Biggboss
- Advertisement -

బిగ్ బాస్ సీజన్ 3 ఇంకో వారంలో రోజుల్లో ముగియనుంది. చివరి వారంలో టాప్ 5 కంటెస్టెంట్స్ గా శ్రీముఖి, వరుణ్ సందేశ్, బాబా భాస్కర్, అలీ రెజా, రాహుల్ లు ఉన్నారు. వచ్చే ఆదివారం రోజున బిగ్ బాస్ 3 టైటిల్ విన్నర్ ఎవరో తేలిపోనుంది. ఇక నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈషోకు అద్బుతమైన స్పందన వస్తోంది. నిన్నటి ఎపిసోడ్ లో శివజ్యోతి ఎలిమినెట్ అయిన సంగతి తెలిసిందే. కాగా ఇవాళ బిగ్ బాస్ హౌస్ లో హౌస్ మెట్స్ తో కలిసి సందడి చేసింది యాంకర్ సుమా కనకాల.

దీనికి సంబందించిన లేటెస్ట్ ప్రోమోను స్టార్ మా.. తాజాగా విడుదల చేసింది. కాసేపు ఇంటి సభ్యులతో కలిసి రచ్చ చేసింది సుమ. మొదటగా ఇంట్లో సభ్యులకు తెలియకుండా శ్రీముకి పక్క బెడ్ లో పడుకుంది సుమ. సుమ నిద్రపోయినట్లు నటిస్తుండటంతో సైరన్ వేశారు బిగ్ బాస్. దీంతో అందరూ లేచే సరికి పక్కన సుమ ఉండటంతో అందరూ షాక్ అయ్యారు. ఆ తర్వాత ఇంటి సభ్యులతో కొన్ని టాస్క్ లు చేపించింది సుమ. ఈ ఎపిసోడ్ ఇవాళ రాత్రి ప్రసారం కానుంది.

- Advertisement -