హోటల్ సిబ్బందితో కోహ్లీ, అనుష్క!

3
- Advertisement -

అప్పుడప్పుడు చాలా చిన్న విషయాలే మనసులో చెరగని ముద్ర వేస్తుంటాయి. తాజాగా స్టార్ కపుల్ అనుష్క శర్మ, విరాట్ కోహ్లీ అహ్మదాబాద్‌లోని ఒక హోటల్‌లో తమ అభిమాని పట్ల చూపించిన ఆప్యాయత ఇప్పుడు సోషల్ మీడియాలో నెటిజన్ల మనసులను గెలుచుకుంటోంది. ఎప్పుడూ లో-ప్రొఫైల్ మెయింటైన్ చేసే ఈ జంట, తమ వినమ్రతతో అందరి ప్రశంసలు అందుకుంటోంది.

తాజ్ హోటల్‌లో పనిచేసే ఆషి అనే ఒక స్టాఫ్ మెంబర్ సోమవారం తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో విరాట్ కోహ్లీ, అనుష్క శర్మలతో దిగిన ఫొటోలను పంచుకున్నారు. అందులో ఒక ఫొటోలో అనుష్క శర్మ పింక్ అండ్ వైట్ కుర్తా-పైజామా సెట్‌లో ఎంతో అందంగా కనిపించగా విరాట్ కోహ్లీ బ్లాక్ టీషర్ట్, ఫేడెడ్ బ్లూ జీన్స్‌తో స్టైలిష్‌గా కనిపించారు. మరొక ఫొటోలో విరాట్ ‘ఛాంపియన్స్’ అని రాసి ఉన్న రెడ్ జెర్సీలో కనిపించారు.

ఈ ఫొటోలతో పాటు తాము హోటల్‌లో ఉన్న సమయంలో తమకు అందించిన సేవలకు కృతజ్ఞతలు తెలుపుతూ కోహ్లీ దంపతులు స్వయంగా చేతిరాతతో రాసి ఇచ్చిన నోట్స్ ఫొటోలను కూడా ఆమె షేర్ చేశారు. ఆ నోట్స్‌లో టు ఆషి, మీరు చేసిన సహాయానికి చాలా ధన్యవాదాలు, మా బెస్ట్ విషెస్ అని రాసి కింద విరాట్… అనుష్క ఇద్దరూ సంతకాలు చేశారు.

ఈ ఫొటోలను పంచుకుంటూ ఆ లేడీ స్టాఫ్.. మిస్టర్ అండ్ మిసెస్ కోహ్లీకి సేవలు అందించడం….వారిని కలవడం నిజంగా ఒక మరచిపోలేని అనుభూతి, హాస్పిటాలిటీ రంగం ఎంత గొప్పదో ఇలాంటి క్షణాలు మనకు గుర్తుచేస్తాయి. వారి స్టే లో నేను ఒక భాగమైనందుకు చాలా సంతోషంగా ఉంది అని రాసుకొచ్చారు.

Also Read:టీఎంసీపై అధిర్ రంజన్‌ ఫైర్

దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. మా కలలను నువ్వు బతికేస్తున్నావు అని ఒకరంటే, అనుష్క కంటే విరాట్ హ్యాండ్‌రైటింగ్ చాలా బాగుంది అని మరొకరు సరదాగా కామెంట్ చేశారు.

- Advertisement -