వైరల్‌..ఎలుగుబంటి నుండి తృటిలో!

5
- Advertisement -

పెంపుడు కుక్కతో కలిసి సరదాగా వాకింగ్‌కు వెళ్లిన ఒక మహిళకు ఊహించని రీతిలో ప్రాణాంతక పరిస్థితి ఎదురైంది. అడవిలో అత్యంత ప్రమాదకరమైన జీవిగా భావించే భారీ ‘గ్రిజ్లీ ఎలుగుబంటి’ ఒక్కసారిగా ఆమెపైకి దూసుకువచ్చింది. కేవలం కొన్ని ఇంచుల దూరంలో మృత్యువు కనిపించినప్పటికీ ఆ మహిళ చూపిన సమయస్ఫూర్తి వల్ల ఆమెతో పాటు ఆమె పెంపుడు కుక్క కూడా ప్రాణాలతో బయటపడ్డాయి. కెనడాలోని అల్బెర్టా ప్రాంతంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఓ మహిళ తన పెంపుడు కుక్కతో కలిసి అల్బెర్టాలోని ఒక పర్వత ప్రాంత మార్గంలో నడుచుకుంటూ వెళ్తోంది. ఆ సమయంలో పొదల్లోంచి ఒక భారీ గ్రిజ్లీ ఎలుగుబంటి హఠాత్తుగా వారి వైపునకు దూసుకొచ్చింది. కుక్కను చూడగానే ఆ ఎలుగుబంటి మరింత ఆవేశంతో దాడి చేయడానికి ప్రయత్నించింది. సాధారణంగా ఇలాంటి క్రూర జంతువులను చూసినప్పుడు ఎవరైనా భయంతో పరుగులు తీస్తారు. కానీ ఆ మహిళ మాత్రం అలా చేయలేదు. ఎలుగుబంటిని చూసి పరిగెత్తితే అది మరింత వేగంగా వెంటాడి వేటాడుతుందని గ్రహించిన ఆమె అక్కడే నిశ్చలంగా నిలబడిపోయింది.

ఎలుగుబంటి దాడికి వస్తున్న సమయంలో ఆమె తన కుక్కను గట్టిగా పట్టుకుని ఎలుగుబంటి వైపు ధైర్యంగా చూస్తూ వెనక్కి అడుగులు వేయడం ప్రారంభించింది. అయితే భయపడిన ఆ కుక్క ఒక్కసారిగా ఆమె చేతిలోంచి తప్పించుకుని ప్రాణభయంతో ముందుకు పరుగెత్తింది. ఎలుగుబంటి కూడా ఆ కుక్కను వెంబడిస్తూ కొద్ది దూరం వెళ్లింది. అయితే అదృష్టవశాత్తూ ఆ తర్వాత ఎలుగుబంటి తన నిర్ణయాన్ని మార్చుకుని అడవి వైపునకు వెళ్ళిపోయింది. ఈ గ్యాప్‌లో మహిళ మరియు ఆమె కుక్క సురక్షిత ప్రాంతానికి చేరుకున్నారు.

Also Read:సందిగ్ధంలో శాంతి ఒప్పందం?

- Advertisement -