హార్ముజ్ జలసంధి గుండా వెళ్తున్న ఒక వాణిజ్య నౌకపై ఇరాన్ జరిపిన దాడికి ప్రతిస్పందనగా… అమెరికా….ఇరాన్ కు చెందిన డ్రోన్, క్షిపణి మరియు రాడార్ కేంద్రాలపై దాడులు చేసింది. అయితే ఇరాన్ కూడా దీనికి ప్రతీకారంగా మధ్యప్రాచ్యంలో ఉన్న అమెరికా స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేయడంతో ఈ ప్రాంతంలో మరోసారి ఉద్రిక్తతలు పెరిగాయి.
గ్లోబల్ సప్లై చైన్‌లను భారీగా దెబ్బతీసి, తీవ్ర అంతరాయం కలిగించిన ఈ ప్రాంతంలోని ఘర్షణలను ముగించేందుకు ఇరు దేశాలు ఒక ఒప్పందానికి వచ్చిన కొద్ది రోజులకే… శుక్రవారం అమెరికా, ఇరాన్‌లు పరస్పరం సైనిక దాడులు చేసుకోవడంతో మధ్యప్రాచ్యంలో మరోసారి ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చాయి.
జూన్ 25న ఒమన్ తీరానికి సమీపంలోని హోర్ముజ్ జలసంధి గుండా ప్రయాణిస్తున్న ఒక వాణిజ్య నౌక (M/V ఎవర్ లవ్లీ) పై ఇరాన్ దాడి చేసినందుకు ప్రతిస్పందనగా అమెరికా సైన్యం ఇరాన్‌ను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసిందని అమెరికా సెంట్రల్ కమాండ్ ఒక ప్రకటనలో తెలిపింది.
ఇరాన్ గురువారం చేసిన చర్యలు నౌకల స్వేచ్ఛా ప్రయాణ హక్కును దెబ్బతీశాయి అని పేర్కొంటూ… ఇరాన్‌కు చెందిన క్షిపణి, డ్రోన్ కేంద్రాలు మరియు తీరప్రాంత రాడార్ కేంద్రాలను లక్ష్యంగా చేసుకున్నట్లు CENTCOM తెలిపింది. జలసంధి గుండా వెళ్లే వాణిజ్య నౌకలకు సురక్షితమైన మార్గాన్ని అందించడానికి CENTCOM దళాలు సమన్వయం మరియు మద్దతును కొనసాగిస్తాయి” అని ఆ ప్రకటన పేర్కొంది. ఇరాన్‌తో కుదిరిన ఒప్పందంలోని అన్ని అంశాలు కచ్చితంగా అమలు అయ్యేలా, పాటించేలా చూసేందుకు అమెరికా సైన్యం అక్కడ అప్రమత్తంగా ఉంటుంది అని తెలిపింది.
అమెరికా జరిపిన దాడులకు ప్రతీకారంగా ఇరాన్ గల్ఫ్ ప్రాంతంలోని అమెరికా స్థావరాలను లక్ష్యంగా చేసుకుంది, అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించలేదు. అమెరికా కూడా ఈ దాడులను ఇప్పటివరకు ధృవీకరించలేదు. “ఈ దురాక్రమణ గనుక మళ్లీ పునరావృతమైతే, మా ప్రతిస్పందన దీనికంటే మరింత తీవ్రంగా ఉంటుంది” అని ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) టెలిగ్రామ్‌లో విడుదల చేసిన ఒక ప్రకటనలో హెచ్చరించింది.
ప్రపంచంలోని మొత్తం ముడి చమురు సరఫరాలో దాదాపు ఐదో వంతు ప్రయాణించే ఈ కీలకమైన హోర్ముజ్ జలసంధిపై తమకే నియంత్రణ ఉంటుందని ఇరాన్ పదేపదే చెబుతుండటంతో, ఇది అమెరికా-ఇరాన్ల మధ్య నిరంతరం వివాద పాయింట్‌గా మారింది. అయితే ఈ జలసంధి ఎప్పుడూ తెరిచే ఉండాలని వాషింగ్టన్ వాదిస్తోంది.
Also Read:ప్రైమ్ వీడియోలో ‘ఇసకపట్నం’

