ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి తన రాబోయే ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ‘వారణాసి’ గురించి ఒక కీలకమైన అప్‌డేట్‌ను పంచుకున్నారు. ఈ సినిమాకు సంబంధించిన చాలా వరకు చిత్రీకరణ ఇప్పటికే పూర్తయిందని ఆయన వెల్లడించారు.
రాజమౌళి మాట్లాడుతూ.. నేను చెప్పగలిగింది ఏంటంటే, మేం షూటింగ్‌లో చాలా పెద్ద భాగాన్ని పూర్తి చేసాం. సినిమాలోని ముఖ్యమైన, భారీ యాక్షన్ సీక్వెన్స్‌ల చిత్రీకరణ అంతా అయిపోయింది. ప్రస్తుతం మేం చిన్న చిన్న ఇంటర్‌కనెక్టింగ్ సీన్స్‌ని చిత్రీకరిస్తున్నాం. కాబట్టి ఆశాజనకంగా సెప్టెంబర్ నాటికి, లేదా అక్టోబర్ కొద్ది రోజుల్లోనే మొత్తం షూటింగ్‌ను పూర్తి చేయాలని అనుకుంటున్నాం అని తెలిపారు.
‘ది హాలీవుడ్ రిపోర్టర్ ఇండియా’తో జరిగిన సంభాషణలో నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ మాట్లాడుతూ.. సెట్‌లో కేవలం 20 నిమిషాలు మాత్రమే లంచ్ బ్రేక్ ఇచ్చేవారని వెల్లడించారు. “ఆయనను చూస్తుంటే ఎంతో కాలం ఎదురుచూసి ఎట్టకేలకు తన మొదటి సినిమాను తీసుకునే అవకాశం దక్కించుకున్న ఒక యువ దర్శకుడిలా కనిపిస్తారు. ఆయన కంటే కష్టపడి పనిచేసే దర్శకుడిని నేను ఇంతవరకు చూడలేదు. వారణాసి సెట్‌లో లంచ్ బ్రేక్‌లు కేవలం 20 నిమిషాలు మాత్రమే ఉంటాయి (నవ్వుతూ) అని పృథ్వీరాజ్ చెప్పారు. అంతేకాకుండా షూటింగ్ సెట్‌కు అందరికంటే ముందుగా వచ్చేది అందరికంటే చివర్లో వెళ్లేది రాజమౌళేనని ఆయన స్పష్టం చేశారు.
ఈ సినిమా రెండు పార్టులుగా రానున్నట్లు తెలుస్తోండగా ఈ చిత్రంలో మహేష్ బాబు, పృథ్వీరాజ్‌లతో పాటు ప్రియాంకా చోప్రా కూడా ఒక ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమా 2027 లో ప్రేక్షకుల ముందుకు రానుంది.
Also Read;ప్రైమ్ వీడియోలో ‘ఇసకపట్నం’

