పరిమితికి మించిన సాహసాలు, అజాగ్రత్త కొన్నిసార్లు ఎంతటి భారీ నష్టానికి దారితీస్తాయో నిరూపించే ఒక షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. యుకేలోని ఓ ప్రసిద్ధ తీర ప్రాంతంలో చేసిన ఒక చిన్న పొరపాటు వల్ల దాదాపు రూ. 1.5 కోట్ల విలువైన లగ్జరీ ‘రేంజ్ రోవర్’ కారు సముద్రపు అలల ఉధృతికి కొట్టుకుపోయింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
సముద్ర తీరానికి అత్యంత సమీపంలో ఇసుకపై లగ్జరీ కారు ఆగిపోయింది. అయితే, సముద్రంలో ఒక్కసారిగా అలల ఉధృతి పెరగడం…ఇసుక మెత్తగా ఉండటంతో కారు టైర్లు అందులో ఇరుక్కుపోయాయి.
కారును బయటకు తీసేందుకు స్థానికులు, సహాయక సిబ్బంది తీవ్రంగా ప్రయత్నించారు. ఒక ట్రాక్టర్ సహాయంతో కారును గట్టుకు లాగేందుకు (Rescue) ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. అలలు ఒకదాని వెనుక ఒకటి బలంగా తాకడంతో చూస్తూ చూస్తూనే ఆ కోటిన్నర విలువైన లగ్జరీ కారు సముద్రపు నీటిలో మునిగిపోయి క్రమంగా కొట్టుకుపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
View this post on Instagram
Also Read:సర్దార్ 2 వర్సెస్ రణబలి!

