వైరల్ : దిల్ రాజు ‘పెన్’ లవ్ స్టోరీ

19
- Advertisement -

సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ఏదో ఒక వీడియో వైరల్ అవుతూనే ఉంటుంది. ఆ వీడియో రీచ్ ను బట్టి న్యూస్ గట్టిగా వైరల్ అవుతుంది. తాజాగా దిల్ రాజు కి సంబంధించి లవ్ స్టోరీ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. దిల్ రాజు ఓ టీవీ చానెల్ కి సంక్రాంతి సందర్భంగా ఇంటర్వ్యూ ఇచ్చాడు. తన భార్య వైగా రెడ్డి తో కలిసి ఇంటర్వ్యూ లో పాల్గొన్నాడు దిల్ రాజు.

దిల్ రాజు భార్య ఎదురుగా ఉండటంతో యాంకర్ కూడా ఆమె మీదే ఎక్కువ ఫోకస్ పెట్టి వారి లవ్ స్టోరీ రాబట్టే ప్రయత్నం చేసింది. అందులో భాగంగా దిల్ రాజు తో తన లవ్ స్టోరీ ఓపెన్ గా చెప్పుకుంది వైగా రెడ్డి అలియాస్ తేజస్విని. తను ఎయిర్ హోస్టేస్‌ గా పని చేస్తున్న టైమ్ లో ఫ్లైట్ లో రాజు గారితో పరిచయం ఏర్పడిందని తెలిపింది. అలాగే దిల్ రాజు తనని పెన్ అడిగారని అక్కడి నుండి మాటలు మొదలయ్యాయని చెప్పుకుంది.

దీంతో దిల్ రాజు భార్య చెప్పిన లవ్ స్టోరీ వీడియో క్లిప్ కట్ చేసి సోషల్ మీడియా లో వైరల్ చేస్తున్నారు నెటిజన్లు. ఇక దిల్ రాజు పెన్ లవ్ స్టోరీ పై మీమ్స్ , ట్రోలింగ్ వీడియోలు గట్టిగా చక్కర్లు కొడుతున్నాయి. ఏదేమైనా దిల్ రాజు రెండో పెళ్లి పెద్దలు కుదిరిచింది కాదని , దాని వెనుక ఫ్లైట్ లవ్ స్టోరీ ఉందని తాజా వీడియో తో బయట పడింది. దీనితో మొన్నటి వరకు ‘వారసుడు’ తో దిల్ రాజు ను ట్రోలింగ్ చేసిన ట్రోలింగ్ బ్యాచ్ తాజాగా లవ్ స్టోరీ క్లిప్ తో ఆయన్ను గట్టిగా ట్రోల్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి…

రేపటి నుండి యాక్షన్ లోకి మహేష్

ఓన్లీ ఎక్స్ పోజింగ్ తోనే ప్రయాణం!

ఎట్టకేలకు పోలీస్ గా ప్రభాస్

- Advertisement -