వేల ఇల్లయ్ పట్టదారి ఎలియాస్ ”విఐపి” అనే తమిళ సినిమాని తెలుగులో రఘువరన్ బీటెక్‌గా డబ్బింగ్ చేశారు. ధనుష్ హీరోగా వచ్చిన ఈ సినిమా ఎంతలా ఆడిందో తెలిసిన విషయమే. తాజాగా వేల్ రాజ్ డైరక్షన్లో రూపొందిన ఈ సినిమాకు ఇప్పుడు సీక్వెల్ రూపొందిస్తున్నాడు ధనుష్. రఘువరన్ పాత్రలో మరోసారి రచ్చ చేయడానికి ఈసారి తనే స్వయంగా కథ మాటలు రాసుకుంటున్నాడు. మరి డైరక్షన్ ఎవరో తెలుసా? మొన్నామధ్య డాడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ తో యానిమేషన్ సినిమా తీసిన చిన్న కూతురు సౌందర్య.. ఇప్పుడు తన అక్కయ్య మొగుడు ధనుష్ ను డైరక్ట్ చేస్తోంది. తమిళ్, తెలుగు లో వస్తున్న ఈ మూవీ ట్రైలర్ ఆదివారం రిలీజయింది.
నాపేరు రఘువరన్.. నేనిప్పుడు వీఐపీ అంటే వెరీ ఇంపార్టెంట్ పనిలేనోడిని అంటూ స్టార్టయ్యే ట్రైలర్ లో పంచ్ డైలాగులు మాత్రం అదుర్స్ అనిపిస్తాయి. ఇక.. ఈ మూవీ లో బాలీవుడ్ అందాల తార కాజోల్ విలన్ గా నటించడం విశేషం. 20 సంవత్సరాల క్రితం ప్రభుదేవాతో ‘మెరుపు కలలు’ అనే సినిమాలో నటించిన కాజోల్, ఆ తరువాత ఇక్కడ ఏ భాషలలో నటించలేదు. అయితే ఇప్పుడు రెండు దశాబ్ధాల తరువాత మళ్లీ వీఐపీలో నటిస్తుంది. కాజోల్, ధనుష్ మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. నేను పులికి తోకలా ఉండటం కన్నా.. పిల్లికి తలలా ఉంటా.. అంటూ ధనుష్ చెప్పే డైలాగ్ కూడా థ్రిల్లింగ్ గా ఉంటుంది. పెళ్లి చూపులు ఫేం రీతూ వర్మ ఈ మూవీలో స్పెషల్ రోల్ చేస్తున్నది. ఈ మూవీకి రజినీ కూతురు సౌందర్య దర్శకత్వం వహిస్తున్నది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న మూవీ పోస్ట్ ప్రొడక్షన్స్ కార్యక్రమాలను జరుపుకుంటున్నది. ఇక.. త్వరలోనే మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.