ధ‌నుష్ ‘మారి2’ ట్రైల‌ర్ విడుద‌ల‌…

624
marai2
- Advertisement -

సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ అల్లుడిగా త‌మిళ ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం అయిన ధ‌నుష్ చిన్న చిన్న సినిమాలు చేసుకుంటూ త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన గుర్తింపు సంపాదించుకున్నారు. అటు న‌టుడిగా, నిర్మాత‌గా త‌గిన ఇండ‌స్ట్రీలో దూసుకుపోతున్నాడు. క‌థ‌ను న‌మ్ముకుంటూ విభిన్న‌మైన సినిమాలు చేస్తున్నాడు. తాజాగా ఆయ‌న న‌టిస్తున్న సినిమా మారి2. ఈమూవీ డిసెంబ‌ర్ 21వ తేదిన విడుద‌ల కానుంది. తాజాగా ఈసినిమాకు సంబంధించిన ట్రైల‌ర్ ను విడుద‌ల చేశారు.

mari2

ఈట్రైల‌ర్ లో ధ‌నుష్ డిఫ‌రెంట్ లుక్ లో క‌నిపిస్తున్నాడు. సాయి ప‌ల్ల‌వి క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ చిత్రంలో వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్ కుమార్ ప్ర‌ధాన పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు. ఈచిత్రానికి బాలాజీ మోహన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ధనుష్ గతంలో చేసిన యాక్షన్ కామెడీ ఫిల్మ్ మారి . మాస్ ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంది మారి.

ఈసినిమాకు ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు యువ‌న్ శంక‌ర్ రాజా సంగీతం అందించారు. సంగీతం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని చెబుతున్నారు చిత్ర‌యూనిట్. మారి సినిమా మంచి విజ‌యం సాధించిన విజ‌యం తెలిసిందే. అయితే మారి2 ఎంత వ‌ర‌కూ విజ‌యం సాధిస్తుందో తెలియాలంటే డిసెంబ‌ర్ 21 వ‌రకూ వేచి చూడాల్సిందే.

- Advertisement -