సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు: వినోద్ కుమార్

203
vinod kumar
- Advertisement -

రెవిన్యూ డివిజన్‌గా వేములవాడను ఏర్పాటుచేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్.కొత్త రెవెన్యూ డివిజన్ కేంద్రంగా వేములవాడను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.

ఈ మేరకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కు వినోద్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు.ఆరు మండలాలతో వేములవాడ రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు కావడం వల్ల ప్రజలకు ఎంతో మేలు చేకూరుతుందని వినోద్ కుమార్ పేర్కొన్నారు.

ఇప్పటికే వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర ఆలయ అభివృద్ధికి శ్రీకారం చుట్టడమే కాకుండా మిడ్ మానేరు నుంచి నీళ్లను అందిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కు ప్రజలు ఎంతో రుణపడి ఉంటారని వినోద్ కుమార్ తెలిపారు.

- Advertisement -