రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు, ఈ కార్యక్రమం లో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ జిల్లా కలెక్టర్ , జిల్లా ఎస్పీ ,జిల్లా పరిషత్ చైర్పర్సన్, సిరిసిల్ల మున్సిపల్ చైర్ పర్సన్ , వేములవాడ మున్సిపల్ చైర్ పర్సన్, జిల్లా గ్రంథాలయ శాఖ అధ్యక్షులు ,జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షులు, ప్రజా ప్రతినిధులు మరియు జిల్లా స్థాయి అధికారులతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.
ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ రైతులు పంటలకు వచ్చే అగ్గి తెగులు , మెడ విరుపు వ్యాధులు మరియు అకాల వర్షాల వల్ల రైతులు నష్టపోతున్నారని రైతులు ఆందోళన పడవద్దు అని వారిని ఆదుకోవడానికి ప్రభుత్వం అన్ని విధాల ముందు ఉంటుందని అన్నారు అదేవిధంగా ధాన్యం కొనుగోలులో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకో వలసిందిగా జిల్లా యంత్రాంగానికి సూచించారు. ధాన్యం చివరి కిలో వరకు కొనుగోలు చేసే విధంగా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుందని అన్నారు అదే విధంగా లాక్ డౌన్ ను కేంద్ర ప్రభుత్వం మే 17 వరకు పొడిగించడం జరిగింది దీనిపైన రాష్ట్ర క్యాబినెట్ మే 5 నాడు సమావేశం ఏర్పరచుకొని లాక్ డౌన్ పైన గౌరవ ముఖ్యమంత్రి నేతృత్వంలో తుది నిర్ణయం తీసుకో బడుతుంది అదే విధంగా లాక్ డౌన్ లో కొన్ని రంగాలకు పని చేసుకునే విధంగా వెసులుబాటు కల్పించే దిశగా ప్రభుత్వం ఆలోచనలు చేస్తుందని మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళ చక్రపాణి లాక్ డౌన్ లో పవర్లూమ్ కార్మికులు బీడీ కార్మికులు మరియు భవన నిర్మాణ రంగ కార్మికులు సహజంగానే సామాజిక దూరాన్ని పాటిస్తారు కావున పనిచేసుకునే వెసులుబాటు కల్పించేలా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకు వెళ్ళగలరని అడగడం జరిగింది.
పవర్లూం కార్మికులు సహజంగానే సామాజిక దూరాన్ని పాటిస్తూ పనిచేస్తారు కావున పవర్లూమ్ రంగానికి లాక్ డౌన్ లో పనిచేసుకునే వెసులుబాటు కల్పించే అంశం పై మంత్రివర్యులు తారక రామారావు పవర్లూమ్ పరిశ్రమపై పూర్తి అవగాహన ఉంది కావును వారితో చర్చించి తదనంతరం ముఖ్యమంత్రి తో క్యాబినెట్ మీటింగ్ లోనూ పవర్లూమ్ రంగానికి లాక్ డౌన్ లో పనిచేసుకునే వెసులుబాటు కల్పించే అంశం పై చర్చిస్తానని అన్నారు. అదేవిధంగా భవన నిర్మాణ కార్మికుల గురించి బీడీ కార్మికుల గురించి కూడా చర్చిస్తానని అన్నారు కరొన నియంత్రణలో ఎప్పటికప్పుడు తగు జాగ్రత్తలు తీసుకుంటూ కరొన వ్యాప్తి చెందకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్న జిల్లా కలెక్టర్ కు మరియు యంత్రాంగానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఇదేవిధంగా అందరూ అప్రమత్తంగా ఉండాలని కరోనా పూర్తిస్థాయిలో తగ్గేవరకు ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని వినోద్ కుమార్ సూచించారు.