బ్యాంకు ఖాతాల్లో రెండో విడత రూ. 1500 జమ…

323
mareddy srinivas reddy
- Advertisement -

కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో రాష్ట్రంలోని తెల్ల రేషన్ కార్డుదారులకు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కే. చంద్రశేఖర రావు గారు ప్రకటించిన రెండో విడత రూ. 1500 నగదు శనివారం నాడు లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయడం జరిగిందని పౌరసరఫరాల సంస్థ చైర్మన్ శ్రీ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.

అర్హులైన లబ్ధిదారులందరికీ రూ. 1500 పంపిణీ చేస్తున్నామని ప్రకటించారు. శనివారం నాడు పౌరసరఫరాల భవన్ లో జరిగిన విలేఖరుల సమావేశంలో చైర్మన్ గారు మాట్లాడుతూ 74.35 లక్షల మంది లబ్ధిదారులకు రూ. 1500 చొప్పున మొత్తం రూ. 1,115 కోట్లను శనివారం నాడు బ్యాంకుల్లో జమ చేయడం జరిగింది. బ్యాంకు ఖాతా లేని 5.38 లక్షల మంది లబ్ధిదారులకు పోస్టాఫీసు ద్వారా రానున్న మూడు రోజుల్లో రూ. 1500 అందించడం జరుగుతుంది.

87.55 లక్షల కుటుంబాలకు గాను ఈ రెండు రోజుల్లో 9 లక్షల (10%) మంది 37 వేల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని తీసుకున్నారు. బియ్యం తీసుకోవడానికి లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవడం జరిగింది. ఎవరూ కూడా ఆందోళ చెందాల్సిన అవసరం లేదు. లబ్ధిదారులు సామాజిక దూరాన్ని పాటిస్తూ బ్యాంకులు, పోస్టాఫీసుల నుంచి నగదును పొందాలి. గత నెల 23వ తేదీ వరకు రేషన్ పంపిణీ చేసినట్టుగానే ఈ నెల కూడా ప్రతి ఒక్క లబ్దిదారుడికి రేషన్ అందే వరకు రేషన్ షాపులు తెరిచే ఉంటాయని తెలిపారు.

యాసంగిలో ఇప్పటి వరకు 5904 కొనుగోలు కేంద్రాల ద్వారా 4 లక్షల మంది రైతుల నుంచి రూ. 4,442 కోట్ల విలువైన 24 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరిగింది. ఇందుకు సంబంధించి రూ. 1500 కోట్లను రైతుల ఖాతాలో జమ చేశాం.గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కే. చంద్రశేఖరరావు గారి ఆదేశాల మేరకు రైతాంగానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా కనీస మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు చేయడం జరుగుతోందని, ఈ విషయంలో రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చైర్మన్ శ్రీ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.

రైతుల నుంచి కొన్న ప్రతి ధాన్యం కొనుగోలు వివరాలను ఓపీఎం వేర్‌లో నమోదు చేసి దాని ప్రకారమే రైతులకు కనీస మద్దతు ధర చెల్లింపులను ఆన్‌లైన్ ద్వారా నేరుగా వారి ఖాతాలో జమ చేస్తున్నాం. కొనుగోలు వివరాలను ఓపీఎంఎస్ సాఫ్ట్ వేర్ లో త్వరితగతిన నమోదు చేయాలని అధికారులను ఆదేశించడం జరిగిందని తెలిపారు.

- Advertisement -