కరోనా టీకా తీసుకున్న వినోద్ కుమార్..

124
vinod kumar
- Advertisement -

కరోనా టీకా తీసుకున్నారు రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ . హైదరాబాద్ కోఠిలోని ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖ సంచాలకుల కార్యాలయంలో కోవాగ్జిన్ టీకా తీసుకున్నారు వినోద్ కుమార్.

వ్యాక్సిన్ విషయంలో ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని ఈ సందర్భంగా వినోద్ కుమార్ అన్నారు. కరోనా మహమ్మారి విజృంభించిన సందర్భంలో వైద్యులు, వివిధ హోదాలోని వైద్య సిబ్బంది ప్రజలకు అందించిన సేవలు మరిచిపోలేనివని ఆయన పేర్కొన్నారు. కరోనా మహమ్మారిని తరిమికొట్టాలి…. అందుకు ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ టీకా వేయించుకోవాలని సూచించారు. తన కుమారుడు డాక్టర్ బోయినపల్లి ప్రతీక్ కూడా కోవాగ్జిన్ టీకా తీసుకున్నారు.

https://www.facebook.com/boianapalli.vinodkumar/
- Advertisement -