వినాయక్ ఎన్నాళ్లకెన్నాళ్లకు.. !

46
- Advertisement -

ఓ టైమ్ లో వి.వి.వినాయక్ తో సినిమా చేయాలని అందరూ హీరోలకు ఉండేది. ఆ క్రమంలోనే ఎన్టీఆర్, మెగాస్టార్, రవితేజ, ప్రభాస్, రామ్ చరణ్ వంటి స్టార్ హీరోలతో ఎన్నో బ్లాక్ బస్టర్ మూవీస్ అందించాడు వినాయక్. అయితే.. ఆ తర్వాత వరుస డిజాస్టర్లతో వినాయక్ గ్రాఫ్ అంతా తిరగబడింది. మరోవైపు హీరోగా కమిట్ అయిన సినిమా కూడా సెట్స్ పైకి వెళ్లి ఆగిపోయింది. ఆ తర్వాత వి.వి.వినాయక్.. బాలయ్యతో సినిమా చేయనున్నట్టు వార్తలు వచ్చాయి కానీ.. అవీ వర్కవుట్ కాలేదు. ఈ క్రమంలో చిరంజీవితో సినిమా ఓకే అయ్యిందని ప్రచారం జరిగింది కానీ.. కుదరలేదు.

అబ్బబ్బే ఇవేమీ కాదు… హీరో రవితేజ తో ఓ క్రేజీ సినిమా ప్లాన్ చేస్తున్నారు అన్నారు. అదీ ముందుకు వెళ్ళలేదు. అయితే వి.వి.వినాయక్ మాత్రం ప్రస్తుతం ఖాళీగా ఉన్నాడు. తాను ఆ మధ్య డైరెక్ట్ చేసిన హిందీ ఛత్రపతి సినిమా రిలీజ్ కి రెడీ అవుతుంది. అయినా, ఈ సినిమా రిజల్ట్ తో వినాయక్ కి ఎలాంటి సంబంధం లేదు. ఇది రాజమౌళి ఛత్రపతికి రీమేక్ సినిమా. కాబట్టి, హిట్ అయినా రాజమౌళికే పేరు పోతుంది.

Also Read: పిక్ టాక్ : కుర్ర హృదయాల్లో విస్ఫోటనం

అందుకే, వి.వి.వినాయక్ మళ్లీ తానేంటో నిరూపించుకోవాల్సిన పరిస్థితిలో ఉన్నాడు. ఈ నేపథ్యంలో హీరో రామ్ తో వి.వి.వినాయక్ కి సినిమా ఓకే అయ్యిందని తాజాగా సమాచారం అందుతుంది. వినాయక్ రాసే కథలకు , క్యారక్టరైజేషన్ కు హీరో రామ్ బాడీ లాంగ్వేజ్‌ ఫెరఫెక్ట్ గా సెట్ అవుతుందని ఈ డెసిషన్ తీసుకున్నాడంటున్నారు. అందుచేత ఈ కాంబోకి క్రేజ్ వచ్చేసినట్టే. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్టు వర్క్ జరుగుతోంది.

Also Read: Hollywood:మరోసారి సిద్ధమైన గాడ్జిలా వర్సెస్ కాంగ్‌..!

- Advertisement -