సెప్టెంబర్‌ 10 నుంచి హైదరాబాద్‌ గణేశ్‌ ఉత్సవాలు..

33
Vinayak Chaturthi

భాగ్యనగర్‌ గణేశ్‌ ఉత్సవాలు సెప్టెంబర్‌ 10వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు భాగ్యనగర్‌ గణేశ్‌ ఉత్సవ సమితి శనివారం మీడియా సమావేశంలో తెలిపింది. ఈ ఏడాది అన్ని జాగ్రత్తలతో నిర్వహించనున్నట్లు ఉత్సవ సమితి జనరల్‌ సెక్రెటరీ భగవంత్‌రావు పేర్కొన్నారు. ఈ నెల 23న భాగ్యనగర్ గణేశ్‌ ఉత్సవ సమితి కార్యాలయాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఉత్సవాలు సెప్టెంబర్‌ 10న ప్రారంభమై.. 19న ఆదివారం నిమజ్జన కార్యక్రమం ఉంటుందని పేర్కొన్నారు.గణేశ్‌ ఉత్సవాలకు 24 రకాల మెడిసినల్ ప్లాంట్స్ ఉపయోగిస్తున్నట్లు చెప్పారు. నిమజ్జనం సమయానికి జీహెచ్ఎంసీ అధికారులు రోడ్లు బాగు చేయడంతో పాటు తాగునీరు అందుబాటులో ఉండేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన కరోనా మార్గదర్శకాల మేరకు అన్ని మండపాల వద్ద అన్ని జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. మండపాలు, దేశ భక్తి, దైవ భక్తి పాటలు మాత్రమే ఉండాలని, డిస్కో పాటలు వద్దొన్నారు.

రా మెటీరియల్ టైమ్ కి ఇవ్వాలి అని ప్రభుత్వాన్ని కోరుతున్నాం..పవర్ ఎక్కువ గణేష్ ఉత్సవాలు సమయంలో ఎక్కువ వాడతాం కాబట్టి ప్రభుత్వం దానిపై కూడ దృష్టి పెట్టాలి. గణేష్ విగ్రహం ఎత్తు కోసం పోటీ పడకుండా.. కరోనా గైడ్లైన్స్ చూస్తూ జాగర్తగా చేసుకోవాలి. ఉత్సవాలకు ప్రజాప్రతినిధులు సహకరించాలని కోరారు.. ఎత్తు గురుంచి మేము ఎప్పుడు గైడ్లైన్స్ ఇవ్వలేదు. గణేష్ ఉత్సవాలు ద్వారా కాలుష్యం లేదు. 24 గంటల తరువాత నిమజ్జనం జరిగిన తరువాత జీహెచ్‌ఎంసీ వాళ్ళు అధికారులు వాటిని తీసి తరలించాలి.గత ఏడాది నిమిజ్జనం చేసే అప్పుడు సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ చేశాం.. ఈసారి కూడ అలానే చేస్తామని ఉత్సవ సమితి పేర్కొంది.