ప్రభాస్ ‘రాధే శ్యామ్’ నుండి ఆసక్తికర అప్‌డేట్‌..

27

ప్రభాస్ తాజా చిత్రంగా ‘రాధే శ్యామ్’ రూపొందుతోంది. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ప్ర‌మోద్‌, వంశీ, ప్ర‌శీద నిర్మాత‌లుగా వ్యవహరిస్తున్నారు. కొన్ని సన్నివేశాలు, ఓ సాంగ్ మిన‌హా షూటింగ్ అంతా పూర్త‌య్యింది. పూర్తి చేద్దామ‌నుకునేలోపు కొవిడ్ సెకండ్ వేవ్ కార‌ణంగా షూటింగ్‌ను ఆపాల్సి వ‌చ్చింది. ఇప్పుడు షూటింగ్స్ క్ర‌మంగా మొద‌ల‌వుతున్న క్ర‌మంలో ‘రాధేశ్యామ్’ మేక‌ర్స్ షూటింగ్ జూలై 22 నుంచి స్టార్ట్ చేయాల‌నుకుంటున్నార‌ట. ప్ర‌భాస్‌, పూజాహెగ్డేల‌పై స‌న్నివేశాలు, సాంగ్ చిత్రీక‌ర‌ణ పూర్తి చేస్తే చిత్రీక‌ర‌ణ పూర్త‌వుతుంది.

మ‌రోవైపు ఇప్ప‌టి వ‌ర‌కు షూటింగ్ పూర్త‌యిన వ‌ర‌కు పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు కూడా పూర్త‌య్యాయి. పెండింగ్ షూటింగ్ పూర్తి కాగానే.. రిలీజ్ డేట్‌పై చిత్ర యూనిట్ అధికారిక ప్ర‌క‌ట‌న‌ను చేయ‌నుంది. పునర్జన్మలతో ముడిపడిన ప్రేమకథ ఇది .. దాదాపుగా విదేశాల్లోనే ఈ కథ నడుస్తుంది. ప్రభాస్ సరసన నాయికగా పూజ హెగ్డే అలరించనుంది. బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ ‘భాగ్యశ్రీ’ ఒక కీలకమైన పాత్రలో కనిపించనున్నారు. ముఖ్యమైన పాత్రను కృష్ణంరాజు పోషిస్తున్నారు. జస్టిన్ ప్రభాకరన్ సంగీతం ఈ సినిమాకి ప్రత్యేకమైన ఆకర్షణగా నిలవనుంది.