అఫిషియల్‌…వినాయక్‌ చేతికి లూసిఫర్!

163
vv vinayak
- Advertisement -

మల‌యాళ సూపర్‌స్టార్ మోహ‌న్‌లాల్ హీరోగా తెరకెక్కిన చిత్రం లూసిఫ‌ర్‌. మలయాళంలో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని హీరో పృథ్వీరాజ్ డైరెక్ట్ చేయడంతో పాటు కీరోల్ పోషించాడు. ఈ మూవీ తెలుగు రీమేక్‌ హ‌క్కుల‌ను మెగా పవర్ స్టార్‌ రామ్‌చ‌ర‌ణ్ ద‌క్కించుకున్నార‌ు. సాహో దర్శకుడు సుజీత్ దర్శకత్వంలో సినిమా తెరకెక్కనుంది.

ఇక తాజాగా సినిమాకు సంబంధించి ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ వచ్చేసింది. తన టీంతో కలిసి ‘లూసిఫర్ ’ కోసం తెలుగు వర్షన్ స్క్రిప్ట్ ను రెడీ చేస్తున్నాడట వి వి వినాయక్ . వినాయక్ రీమేక్ స్క్రిప్ట్ విషయంలో చిరంజీవి సంతృప్తి వ్యక్తం చేశారట.

ఇక ప్రస్తుతం చిరు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య మూవీ తెరకెక్కతున్న సంగతి తెలిసిందే. చిరు బర్త్ డే సందర్భంగా విడుదలైన మోషన్ పోస్టర్‌ని మంచి స్పందన వచ్చింది. ఈ మూవీ తర్వాత లూసిఫర్ రీమేక్ తెరకెక్కనుంది.

- Advertisement -