వివిఆర్‌..ప్రీ రిలీజ్‌ బిజినెస్‌@94 కోట్లు

245
vvr
- Advertisement -

మెగా పవర్ స్టార్ రామ్‌ చరణ్‌-బోయపాటి శ్రీనివాస్ కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం వినయ విధేయ రామ. సంక్రాంతి కానుకగా జనవరి 10న సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది. ఇప్పటికే సినిమా ఫస్ట్ లుక్‌,టీజర్‌,ట్రైలర్‌లతో అంచనాలను పెంచేసిన వివిఆర్ తాజాగా ప్రీ రిలీజ్ బిజినెస్‌లోను సత్తాచాటింది.

తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవరిస్‌తో కలిపి ప్రీ రిలీజ్ బిజినెస్‌లో చెర్రీ గత సినిమా రికార్డులను తిరగరాసింది. ఏకంగా 94 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్‌తో సంక్రాంతికి దుమ్ముదులిపేందుకు రెడీ అయ్యాడు చెర్రీ.

నిజాంలో 20 కోట్లు,సీడెడ్: 15 కోట్లు, యూఏ: 11.70 కోట్లు, ఈస్ట్: 7.20 కోట్లు, గుంటూరు: 7.80 కోట్లు, కృష్ణ: 6.00కోట్లు, వెస్ట్: 5.60 కోట్లు, నెల్లూరు: 3.30 కోట్లు ఓవరాల్‌గా ఏపీ/తెలంగాణలో కలిపి 77 కోట్లు రాబట్టింది. ఇతర రాష్ట్రాల్లో: 8.50 కోట్ల బిజినెస్ చేయగా ఓవర్సీస్‌లో 9 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.

యూ/ఏ సర్టిఫికెట్ పొందిన ఈ చిత్రంలో చెర్రీ సరసన కీయారా అద్వానీ హీరోయిన్ గా నటించగా ఈ సినిమా ను డివివి దానయ్య డి.వి.వి ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.

- Advertisement -