న్యూజెర్సీలో ఎన్టీఆర్ ప్రీ రిలీజ్‌…

222
ntr biopic
- Advertisement -

మాజీ సీఎం ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ఎన్టీఆర్. రెండు పార్టులుగా తెరకెక్కుతున్న చిత్రం ఫస్ట్ పార్ట్ జనవరి 9న విడుదల కానుంది. సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాల్లో భాగంగా ఇవాళ నందమూరి తారకరామారావు స్వగ్రామం నిమ్మకూరుకు ఇవాళ ఆయన కుమారుడు, సినీనటుడు బాలకృష్ణ వెళ్లనున్నారు. నిమ్మకూరులోని ఎన్టీఆర్‌ దంపతులు విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించనున్నారు.

ఇక అమెరికాలోని న్యూజెర్సీకి చెందిన ఎన్టీఆర్‌ అభిమానులు ఆదివారం ప్రీ రిలీజ్‌ వేడుకను నిర్వహించారు. ఈ వేడుకకు
ఎన్టీఆర్‌ మనవడు, సినీ నటుడు తారక రత్న ముఖ్య అతిథిగా విచ్చేసి అభిమానులతో సందడి చేశారు. కేక్‌పై ‘యన్‌టిఆర్‌: కథానాయకుడు’ అని రాసున్న పోస్టర్‌ను డిజైన్‌ చేయించి దానిపై ‘ఎన్‌బీకే ఆర్మీ, న్యూజెర్సీ’ అని ప్రింట్‌ చేయించడం ఆకట్టుకుంటోంది.

ntr tarakaratna

8న అమెరికాలోని తెలుగు ప్రేక్షకుల కోసం ప్రీమియర్‌ షోను వేయనున్నారు. ఫిబ్రవరిలో రెండో భాగమైన యన్‌టిఆర్‌: మహానాయకుడు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

- Advertisement -