పప్పులేని ప్రభుత్వం కావాలి !

230
Vinay Pradhan, who called Rahul Gandhi 'Pappu', resigns from the congress
Vinay Pradhan, who called Rahul Gandhi 'Pappu', resigns from the congress
- Advertisement -

వాట్సాప్ మెసేజ్‌లో రాహుల్ గాంధీని పప్పు అని వ్యవహరించి పదవి పొగోట్టుకున్న విజయ్ ప్రధాన్ గుర్తున్నాడా..? సహజంగా తెలివితక్కువ వారిని పప్పు, మొద్దు, బండ అంటూ నానా రకాలుగా తెలుగులో సంబోధిస్తుంటారు. ఐతే పప్పూ అనేది హిందీలో పిల్లవాడని అంటారట… అంటే, యువకుడు అని అర్థం చేసుకోవాలట. ఐతే ఇది పెడార్థం అని కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటున్నారు. ఇప్పుడు ఈ పప్పు పదమే పార్టీ జిల్లా అధ్యక్షుడి పదవిని ఊడేట్లు చేసింది. తాజాగా వినయ్ ప్ర‌ధాన్.. ప‌బ్లిగ్గానే రాహుల్ గాంధీపై విరుచుకుప‌డుతున్నాడు.

అంతేకాదు త‌న‌లాగే మ‌రికొంద‌రు కాంగ్రెస్ బాధితుల‌తో క‌లిసి ప‌ప్పు ముక్త్ (పప్పు లేని) భార‌త్ కోసం కృషి చేస్తాన‌ని రాహుల్‌కు వ్య‌తిరేక ప్ర‌చారం మొద‌లుపెట్టారు వినయ్ ప్ర‌ధాన్. 22 ఏళ్లు పార్టీకి సేవ‌లందించిన ప్ర‌ధాన్‌.. బుధ‌వారం కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పారు.  పార్టీ ప్ర‌తిష్ట త‌గ్గ‌డానికి రాహుల్ గాంధీయే కార‌ణ‌మ‌ని ఆరోపించారు. రాహుల్‌, ఆయ‌న చుట్టూ ఉన్న వాళ్లు కాంగ్రెస్ ముక్త్ భార‌త్ కోసం ప్ర‌య‌త్నిస్తున్న‌వారి క‌ల‌ల‌ను సాకారం చేయ‌డానికి త‌మ వంతు కృషి చేస్తున్నారు. త‌న పొగిడిన విష‌యాన్ని కూడా గుర్తించ‌ని వ్య‌క్తి నా దృష్టిలో పప్పుయే. ఆయ‌న్ని అలా అన్నందుకు ఏమీ చింతించ‌డం లేదు అని విజ‌య్ స్ప‌ష్టంచేశారు. త‌న‌లాగే కాంగ్రెస్ పార్టీతో విసుగు చెందిన మ‌రికొంద‌రు కూడా పప్పు ముక్త్ భార‌త్ ప్ర‌చారంలో నా వెంట వ‌స్తున్నార‌ని చెప్పారు.

కాగా వాట్సాప్‌లో రాహుల్‌ గాంధీ పోస్టు చూసిన వెంటనే కాంగ్రెస్ పార్టీ వినయ్ ప్రధాన్‌పై క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. వెంటనే ఆయన్ను అన్ని పదవుల నుంచి తప్పించడమే కాకుండా పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. తన వివరణ కూడా తీసుకోకుండా పార్టీ తనను ఇలా బలిపశువును చేసిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి ఎవరైనా ఆయనకు కిట్టనివారు ఫోన్ ద్వారా ఇలా చేసి వుంటారా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. చివరకు కాంగ్రెస్‌ పార్టీని వదిలి పప్పులేని భారత్‌ కోసం అంటే రాహుల్‌ గాందీలేని ప్రభుత్వం కోసమే కృషి చేస్తానని కంకణం కట్టుకున్నారు వినయ్ ప్రధాన్‌.

- Advertisement -