కేంద్రమంత్రిని కలిసిన చీఫ్ విప్ వినయ్ భాస్కర్..

371
piyush goel
- Advertisement -

ఢిల్లీలో కేంద్రమంత్రి పీయూష్ గోయల్‌ని కలిశారు ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్. ఎంపీ బండా ప్రకాశ్‌తో కలిసి పీయూష్ గోయెల్, ఆర్కియాలజీ డైరెక్టర్ జనరల్ ను కలిశారు. ఈ సందర్భంగా మాట్లాడిన వినయ్…రైల్వే ప్రాజెక్టు, చరిత్రాత్మక కట్టడాలు తన నియోజకవర్గ పరిధిలో ఉన్నాయని..కాజీపేట జంక్షన్ ను డివిజన్ స్థాయికి అప్ గ్రేడ్ చేయాలన్నారు.

విభజన చట్టంలో హామీ మేరకు కాజిపేట్లో తక్షణమే కోచ్ ఫ్యాక్టరీ నిర్మాణం చేపట్టాలన్నారు. కాజిపేట్ స్టేషన్ లో కొన్ని రైళ్లు హల్ట్ జరగాల్సి ఉందన్నారు.ఇసుక పరిజ్ఞానంతో కూలిన వాటిని తిరిగి నిర్మాణం చేపట్టాలని కోరామని…నిధులు కూడా విడుదల చేయాలని విజ్ఞప్తి చేసాం.. సానుకూలంగా స్పందించారని చెప్పారు.

వరంగల్ నగరంలో పర్యాటక అభివృద్ధికి అవకాశం ఉందని..ముఖ్యమంత్రి కేసీఆర్ వరంగల్ నగరంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి అభివృద్ధి చేస్తున్నారు..కేంద్రం కూడా సహాయం చేయాలన్నారు.

బడ్జెట్ చూస్తేనే తెలంగాణపై కేంద్రం చూపిస్తున్న వివక్ష స్పష్టంగా కనబడుతోందన్నారు ఎంపీ బండా ప్రకాష్. కొత్త రాష్ట్రం అద్భుతమైన ప్రగతి సాధిస్తున్న రాష్ట్రానికి కేంద్రం అన్ని రకాలుగా సహాయం అందించాలన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రలకు మాత్రమే కేటాయింపులు ఉన్నాయని..బడ్జెట్ లో కొత్త రైల్వే ప్రాజెక్టులు లేవు.. కేవలం కొత్త ప్రైవేటు రైళ్లు మాత్రమే ఉన్నాయని చెప్పారు.

- Advertisement -