లుంగీ డ్యాన్స్‌తో అదరగొట్టిన దీపికా..

296
Vin Diesel steps with Deepika to Lungi Dance
- Advertisement -

ట్రిపుల్ ఎక్స్ ది రిటర్న్ ఆఫ్ ది జాండర్ కేజ్‌ మూవీ ప్రమోషన్‌లో భాగంగా బాలీవుడ్ బ్యూటీ దీపికా..హాలీవుడ్ హీరో విన్ డీజెల్‌ అదరగొట్టారు. ఈ చిత్రం జనవరి 14న తెలుగు, తమిళం, హిందీ భాషలలో విడుదల కానుంది. ముంబైలో ఓ థియేటర్‌లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న విన్ డీజెల్, దర్శకుడు డీజె కరుసో, దీపికా ప్రీమియర్ షోలో అభిమానులను అలరించారు. దీపిక ధరించిన డ్రెస్ యూత్ కి నిద్ర లేకుండా చేసింది. గోల్డ్ డ్రెస్‌లో మెరిసిన దీపిక అభిమానుల మతి పొగోట్టింది.

Vin Diesel steps with Deepika  to Lungi Dance

ఈ ప్రీమియర్ షోలో విన్ డీజెల్, దీపికలు లుంగీ డ్యాన్స్ తో సందడి చేశారు. వీరి సందడికి థియేటర్స్ దద్దరిల్లాయి. థియేటర్‌ దద్దరిల్లేలా ఒకటే ఈలలు వేస్తూ గోల చేశారు అభిమానులు. విన్ డీజెల్ పలు కాస్ట్యూమ్స్ లో కెమెరాకి ఫోజులిచ్చాడు. ఇక షోకి వచ్చిన ప్రతి ఒక్కరు ఈ చిత్రంపై ప్రశంసలు కురిపించారు.

Vin Diesel steps with Deepika  to Lungi Dance

ప్రపంచ వ్యాప్తంగా జనవరి 20న విడుదల కానున్న ఈ సినిమా.. ఇండియాలో మాత్రం జనవరి 14నే ప్రేక్షకుల ముందుకు రానుంది. సంక్రాంతి నేపథ్యంలో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ, హిందీ వెర్షన్లలో రిలీజ్‌ చేస్తే భారీ వసూళ్లు రాబట్టవచ్చన్న ఆలోచనతోనే సినిమా విడుదల ప్రీ పోన్‌ చేసినట్లు తెలిసింది. ఈ చిత్రంలో టోనీజా, శామ్యూల్ జాక్సన్, టోని కొలెట్, నినా డొబ్రెవ్, రూబీ రోజ్ ప్రధాన పాత్రలు పోషిస్తోండగా దీపిక సెరీనా ఉంగర్ అనే పాత్ర పోషించింది. దీపిక కూడా దక్షిణాది అమ్మాయే కావడం మరో సానుకూలాంశం.

ప్రపంచంలోని అందరు హీరోల్లోకి డిఫరెంట్‌గా, నున్నటి బోడి గుండునే తన ట్రెండ్‌ మార్క్‌గా ట్రెండ్‌ సెట్‌ చేశాడు విన్‌ డిజిల్‌. ‘ట్రిపుల్‌ ఎక్స్‌: రిటర్న్‌ ఆఫ్‌ జాండర్‌ కేగ్‌’ సినిమా ప్రమోషన్‌ కోసం మొట్టమొదటిసారి ఇండియాకు వచ్చిన డిజల్‌కు ఘన స్వాగతం లభించింది. ఈ షోకి రణ్ వీర్ సింగ్, పద్మావతి మూవీ కోస్టార్ షాహిద్ కపూర్, కల్కి కొచ్చిన్, నీల్ నితీష్ ముకేష్, ఇర్ఫాన్ ఖాన్,హుమా ఖురేషీ, కృతి సనన్ , రిచా చద్దా తదితరులు హాజరయ్యారు.

https://youtu.be/7sviyWCPa7Y

- Advertisement -