పోటాపోటిగా శాతకర్ణి, ఖైదీ టికెట్ ధరలు..!

246
Khaidi 3 Tickets Cost Rs 36 Lakhs
- Advertisement -

ఇది అభిమానులు తమ అభిమానాన్ని చూపించాల్సిన తరుణమో ఏమో అన్నట్లుగా ఉంది.పెద్ద హీరోల మొదటి రోజు మొదటి టికెట్లను వేలం వేయడం ఆనవాయితీగా మారిన తరుణంలో గౌతమీపుత్ర శాతకర్ణి, ఖైదీ నంబర్ 150 టికెట్ల ధరలు సరికొత్త రికార్డులను సృష్టించాయి. గౌతమీపుత్ర శాతకర్ణి, ఖైదీ నంబర్ 150 చిత్రాల టిక్కెట్లను అభిమానులు లక్షలు పోసి కొనుగోలు చేశారు.

బాలయ్య వందో చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి చూసేందుకు అతని వీరాభిమాని గోపీచంద్ ఇన్నమూరి అక్షరాలా లక్షా వంద రూపాయలు ఖర్చు పెట్టాడు. హైదరాబాద్ భ్రమరాంబా థియేటర్ లో ప్రీమియర్ షో టికెట్ కోసం ఇంత చెల్లించాడు. అయితే ఈ మొత్తాన్ని ఇండో-అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రికి విరాళంగా అందజేయనున్నారు. ప్రీమియర్ షో నిర్వాహకులైన మన బాలయ్య డాట్ కాం. నవీన్ మోపర్తి..గోపీచంద్ ఇన్నమూరికి హీరో నారా రోహిత్ చేతులమీదుగా ఈ టికెట్ అందజేశారు.

ఇక చాలా కాలం తరువాత రీఎంట్రీ ఇచ్చిన చిరు మూవీ ఖైదీ కోసం మెగా అభిమానులు లక్షల రూపాయలు తృణపాయంగా ఖర్చుపెట్టారు. బెంగళూరులోని ఓ థియేటర్ లో ఫస్ట్ డే ఫస్ట్ షోకు సంబంధించిన టికెట్లు వేలం పెట్టగా.. ఓక్కో టికెట్ కు 12 లక్షలు పోసి, 36 లక్షలకు మూడు టిక్కెట్లు దక్కించుకున్నట్లు సమాచారం.

నిజానికి ఇంత మొత్తంలో చెల్లించి ఒక రోజు లేక రెండు రోజులు ధియేటర్ యాజమాన్యాలు సినిమాలను కూడా ప్రదర్శిస్తున్నాయి. అయితే అభిమానంతో పోల్చితే ఇదేమంత పెద్ద లెక్క కాదంటున్నారు ఫ్యాన్స్ . గతంలో బాలకృష్ణ సినిమాలకు ఓవర్సీస్ లో భారీ ఎత్తున ఫస్ట్ టికెట్ ను కొనుగోలు చేసిన అభిమానులున్నారు. ఏదేమైనా.. ఇలాంటి అభిమానాన్ని మంచి పనులకు వాడితే ఇంకా బాగుంటుంది.

- Advertisement -