జడేజా….టీంమిండియాలో అత్యుత్తమ ఫిల్డర్‌గా, అల్ రౌండర్ గా పేరున్న ఆటగాడు. తన స్పిన్ మాయాజాలంతో ఎలాంటి బ్యాట్స్‌మెన్ అయిన తన బంతులతో అతన్ని పెవిలియన్‌కు పంపిస్తాడు. ఇదీ జడేజా రికార్డు. కానీ ఇటీవల కోల్‌కతా నైట్‌రైడర్స్-చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచులో చెన్నై ఓటమిపాలైన విషయం తెలిసిందే.
ఈ మ్యాచులో ఓపెనర్ సునీల్ నరైన్ వరుస బంతుల్లో ఇచ్చిన రెండు సునాయస క్యాచ్‌లను వదిలేసి జట్టు ఓటమికి కారణమయ్యాడని అందరు విమర్శించారు. అస్సలు ఫీల్డింగ్ చేస్తుంది జెడేజానేనా అన్నట్లుగా అందరు విమర్శలకు పని చెప్పారు. సీన్ కట్ చేస్తే..రాయల్ చాలెంజర్స్ బెంగళూరు-చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో జడేజా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకుని ప్రశంసలందుకున్నాడు. ఏకంగా విలువైన ఆటగాళ్ల వికెట్లు పడగొట్టి పెవిలియన్‌కు దారి చూపాడు.
కాగా మూడు కీలక వికెట్లు పడగొట్టి చెన్నై విజయంలో కూడా కీలక పాత్ర పోషించాడు. నాలుగు ఓవర్లు వేసి కేవలం18 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఏకంగా 3 వికెట్లను పడగొట్టి విమర్శకుల నోళ్లకు తాళం వేసి శభాస్ అనిపించుకున్నాడు. ఈ మ్యాచ్‌లో చెన్నై ఆరు వికెట్ల తేడాతో ఆర్సీబీపై విజయం సాధించిన విషయం తెలిసిందే.