అభిమానికి ధైర్యం అందించిన బన్నీ…

215
allu arjun gave 10 lakhs to his Fan Dev sai Ganesh
- Advertisement -

తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు నేర్పర్చుకున్న హీరో అల్లు అర్జున్. మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన బన్నీ తన నటనతో, డ్యాన్స్ తో తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యాడు. ఈ మధ్య తన అభిమానులకు చాలా దగ్గరగా ఉంటున్న బన్నీ వారి కష్ట సుఖాలను పంచుకుంటున్నాడు. తాజాగా ఓ అభిమాని అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలుసుకుని స్వయంగా ఇంటికి వెళ్లి ఆ అభిమానికి ధైర్యం అందించాడు.

allu arjun gave 10 lakhs to his Fan Dev sai

విశాఖపట్నం అనకాపల్లిలో దేవసాయి గణేష్ అనే యువకుడు బోన్ కేన్సర్ తో బాధపడుతున్నాడు. ఆ యువకుడిని నీ చివరి కోరిక ఏంటని అడగగా నేను అల్లు అర్జున్ అభిమానిని తనని ఒక్కసారి కలిపించండి అని చెప్పుకొచ్చాడు. ఈ విషయాన్ని బన్నీకి తెలియజేయగా… అనకాపల్లికి వెళ్లి దేవసాయి గణేష్ ని పరామర్శించి… ఆ అభిమానితో ముచ్చటించారు. అంతేకాకుండా రూ.10 లక్షల ఆర్థిక సహాయం కూడా చేశాడు బన్నీ. అభిమాని చివరి కోరిక తీర్చిన బన్నీపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

allu arjun gave 10 lakhs to his Fan Dev sai Ganesh

మరోవైపు బన్నీ కథానాయకుడిగా నటించిన ‘నా పేరు సూర్య’ మే 4న విడుదలై మంచి టాక్ తో దూసుకెళ్తుంది. దేశ భక్తి నేపథ్యంలో తెరికెక్కిన ఈ మూవీలో బన్నీ ఆర్మీ ఆఫీసర్ పాత్రలో ఒదిగిపోయాడు. ఈ చిత్రంలో అను ఇమ్మానుయెల్ కథానాయికగా నటించింది.

- Advertisement -