పల్లెల అభివృద్దే పరమావధి- మంత్రి కొప్పుల

149
minister koppula
- Advertisement -

జగిత్యాల జిల్లాలో చేపడుతున్న మీషన్ భగీరథ, ఇతర అభివృద్ది కార్యక్రమాలు,పల్లె ప్రగతి పనుల నిర్వహణకు ఎదురయ్యే సమస్యలను గురించి తెలుసుకుని సకాలంలో పూర్తిచేయడానికి వీలుగా జిల్లా, మండల, డివిజనల్ స్థాయి అధికారులు, ప్రజాప్రతి నిధులతో స్పెషల్ డ్రైవ్ క్రింద 12 మందితో కమిటిని ఏర్పాటు చేయడం జరుగుతుందని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. శనివారం ధర్మపురి నియోజక వర్గానికి సంబంధించిన పలు శాఖలు మిషన్ భగీరథ, పంచాయితీ రాజ్ ఇంజనీరింగ్, రోడ్లు &భవనాలు, ఎస్.ఆర్.ఎస్.పి, పెండింగ్ పనులు, డిర్డీఏ స్వశక్తి సంఘాల నిర్వహణ, టెంపుల్ డేవలెప్మెంట్ మరియు ఇతర అభివృద్ది పనులపై అధికారులు, ప్రజాప్రతినిధులతో సమావేశం నిర్వహించడం జరిగింది.

ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ.. పల్లెల అభివృద్దే పరమావధిగా రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన ప్రతి కార్యక్రమం విజయవంతమయ్యేలా 12 మంది సభ్యులతో ఫిబ్రవరి 1వ తేది నుండి నెలరోజల పాటు కమిటి ఏర్పాటు చేయడం జరుగుతుందని పేర్కోన్నారు. ఈ కమిటి సభ్యులు మండలంలోని ప్రతి గ్రామంలో పర్యటించి జరగుతున్న అభివృద్ది కార్యక్రమాలను పరిశీలించి మండలంలో అధికారులతో సమావేశం నిర్వహించుకోని పెండింగ్ పనుల నిర్వహణలో ఎదురరయ్యే సమస్యలు, వాటి పరష్కారం గురించి చర్చించుకొవడం జరుగుతుందని అన్నారు. సమస్యల పరిష్కారం కొరకు వ్యవస్థ మాత్రమే నడవాలేకాని వ్యక్తి కాదనే వాస్తవాన్ని ప్రజాప్రతినిధులు గుర్తుంచుకొని పనులు చేయాలని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంతో ప్రతిష్టాత్మకంగా బావించి తీసుకువచ్చిన మిషన్ భగరథ కార్యక్రమం అత్యంత ప్రాదాన్యత కలిగిన కార్యక్రమమని, సకాలంలో ప్రాజెక్టును పూర్తిచేసి ప్రతి ఇంటికి మంచినీరు అదించాలనే సంకల్పంతో పనుల నిర్వహించాలని అన్నారు.

దేశంలోఎక్కడా లేని విధంగా గోదావరి నదీజలాలు, ఇతర నదీజలాలను ఒడిసి పట్టెలా అనేక రకాల పంప్ హౌజ్ లు, రిజర్వాయర్లును ఏర్పాటు చేసి పైపు లైన్ ల ద్వారా యావత్ తెలంగాణా ప్రజలకు మంచినీటిని అందించాలనే సంకల్పంతో కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుందని పేర్కోన్నారు. పనుల నిర్వహణలో ఎదురయ్యే సమస్యలకు శాస్వత పరిష్కారం చేసుకోడం జరుగుతుంది.దాదాపు 99% అన్ని గ్రామాలకు ట్యాంకుల ద్వారా మిషన్ భగీరథ నీటిని అందించుకోడం జరుగుతుందని అన్నారు. గ్రామాలలో ట్యాంకు, పైపు లైను పనులు దాదాపుగా పూర్తయినప్పటకి, పనుల మద్య ఏర్పడిన గ్యాప్లను పూర్తిచేయాలని, తద్వారా ట్యాంకులకు నీరు అందుతుందని అన్నారు. ఎత్తు ప్రాంతాలలో ఉన్న ట్యాంకులకు నీరు అందించడంలో కోన్ని సమస్యలు ఎదురైనట్లు గుర్తించడం జరిగిందని వాటిని పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని అన్నారు. పనులు పూర్తిచెయాలనే నియమాన్ని తూచాతప్పకుండా పాటించి నీరు అందించేలా చూడాలని పేర్కోన్నారు.

మండల స్థాయి అధికారులు పనుల నిర్వహణలో ఎదురయ్యే సమస్యలను గురించి తెలియజేయాలని,తద్వారా పరిష్కారం దిశగా కృషి చేయడం జరుగుతుందని పేర్కోన్నారు. ధర్మపురి నియోజకవర్గంలో కావలసిన పనులకు సంబంధించిన ప్రతిపాదనలు తయారు చేసి ప్రభుత్వానికి పంపించాలని అన్నారు. నివేధికను తయారు చేసే సమయంలో పైపు లైను ఎన్ని కిలోమిటర్లకు ఇవ్వడం జరిగింది, ఇంకా ఇవ్వవలసినవి ఉన్నాయా, ఓవర్ హెడ్ ట్యాంకులను కావలసిన చోట ఉన్నాయ గుర్తించుకొని నివేదికను సరిచూసుకొని నివేధికను పంపించడం మాత్రమే కాకుండా సంపూర్ణంగా పనులు పూర్తిచేయడంలో కృషి చేయవలసిన అవసరం ఉందని అన్నారు. టెంపుల్ సిటి అయిన ధర్మపురికి భక్తులు సమృద్దిగా మంచినీటి అంధించి, కొరత లేకుండా ప్రత్యేక శ్రద్ద వహించాలని సూచించారు. గ్రామాల్లో ప్రజల అవసరం మేరకు కావలసిన అన్ని సమస్యలు పరిష్కరించబడాలని అన్నారు. మీషన్ భగీరథ పనులను అత్యంత ప్రాదాన్యతను ఇచ్చి సకాలంలో పనులను పూర్తిచేయాలని, వేలాదిమంది కార్మికులకు కోవిడ్ సమయంలో సహయంచేయడం జరిగిందని, తద్వారా పనులలో విజయం సాధించగలుగుతామాని తెలియజేశారు.

పనులను సకాలంలో పూర్తిచేసి మిగిలిన వారికి ఆదర్శంగా నిలవాలని అన్నారు. మండలాల్లో పెండింగ్ లో ఉన్నటువంటి పంచాయతీ రాజ్ శాఖ మరియు ఇతర శాఖల అభివృద్ది కార్యక్రమాలను వెంటనే పూర్తి చేయవలసిందిగా స్థానిక ప్రజా ప్రతినిధులు ప్రత్యేక శ్రద్ద చూపాలని కోరారు. పనులు సకాలంలో పూర్తికానియెడల, ప్రైవేటు ఏజెన్సీ నియమించి వారికి టెండర్లు పిలిచి పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకొవాలని తెలియజేశారు. స్త్రీ నిధి రుణాలు, ఫుడ్ ప్రాసెసింగ్, ప్యాకింగ్ ఇతర చిన్న చిన్న వ్యక్తిగత యూనిట్స్ ఇస్తున్నారని, బ్యాంక్ లింకేజీ రుణాలు 100% పూర్తి చేయాలని, కుటీర పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు,మినీ డైరీ, పందిరి కూరగాయల పెంపకం ఇతర చిన్నా తరహా పరిశ్రమలు ఏర్పాటు చేసుకొని ఆర్థికంగా ఎదగాలనేదె దీని ముఖ్య ఉద్ద్యేశం అని అన్నారు. అదేవిధంగా ధర్మపురి దేవాలయం కు సంబంధించిన అభివృద్ధి పనులు సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో మిషన్ భగీరథ వాటర్ గ్రిడ్ మరియు ఇంట్రా, పంచాయితీ రాజ్, రోడ్లు భవనాలు ఇంజినీరింగ్ అధికారులు, అడిషనల్ పిడి,ఎంపిడివోలు, సిసి లు, ఏపీఎంలు, జెడ్పిటిసిలు, ఎంపిటిసిలు,ఎంపిపిలు, సర్పంచులు, స్థానిక ప్రజాప్రతినిధులు,తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -