వ్యవసాయ శాఖపై సీఎం కేసీఆర్ సమీక్ష..

136
kcr
- Advertisement -

హైదరాబాద్ ప్రగతి భవన్‌లో ఈరోజు వ్యవసాయ, మార్కెటింగ్‌ శాఖపై ఉన్నతస్ధాయి సమీక్ష నిర్వహిస్తున్నారు సీఎం కేసీఆర్‌. ఈ సమావేశానికి మంత్రులు నిరంజన్‌రెడ్డి, గంగుల కమలాకర్‌, వేముల ప్రశాంత్‌రెడ్డి, పౌరసరఫరాల సంస్థ చైర్మన్‌ శ్రీనివాస్‌రెడ్డి, అన్ని జిల్లాల వ్యవసాయ, మార్కెటింగ్‌ శాఖ అధికారులు హాజరయ్యారు. యాసంగి సీజన్ కార్యాచరణ ప్రణాళికపై చర్చించడంతో పాటు పంటలసాగు, కొనుగోళ్లు, గిట్టుబాటు ధర, అధికారుల పాత్రపై దిశానిర్దేశం చేయనున్నట్లు తెలుస్తోంది.

కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలతో పంట కొనుగోళ్లపై గందరగోళం ఏర్పడింది. ఈ నేపథ్యంలో పంట కొనుగోళ్లపై కేంద్ర చట్టాల ప్రభావం, రాష్ట్ర ప్రభుత్వం పంటలు కొనవచ్చా? లేదా? కొనుగోలు చేయాలంటే ఎలాంటి ప్రణాళికను అనుసరించాలి? లేదంటే రైతులకు పరిస్థితులను ఏ విధంగా వివరించాలి? తదితర అంశాలపై ఈ సమావేశంలో ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

- Advertisement -