సుపారీ ఇచ్చి మరీ.. కాల్పులు చేయించుకున్నాడు

200
Vikram Goud plans an attack on himself
- Advertisement -

మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్ పై కాల్పుల కేసులో మిస్టరీ వీడింది. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి ముఖేశ్ గౌడ్ కుమారుడు విక్రమ్‌గౌడ్‌పై శుక్రవారం తెల్లవారుజామున జరిగిన కాల్పుల ఘటన సంచలనం సృష్టించిన విషయం విదితమే. శుక్రవారం తెల్లవారుజామున 3 గంటలకు తనపై కాల్పులు జరిగాయని , బైక్‌పై ఇద్దరు వ్యక్తులు వచ్చి కాల్పులు జరిపారని విక్రమ్ పోలీసులను తప్పుదారి పట్టించాడని తేలిపోయింది. అప్పుల ఊబిలో కూరుకుపోయిన విక్రమ్ గౌడ్ తండ్రి ముఖేష్ గౌడ్‌ను బెదిరించేందుకు ఈ ప్రయత్నం చేసినట్టు పోలీసులు తేల్చారు.

డబ్బులు ఇవ్వాలని తండ్రిని బెదిరించేందుకు, ఫైనాన్షియర్ల నుంచి తప్పించుకునేందుకు ఈ ప్లాన్ చేసినట్లు, పక్కా ప్లాన్ ప్రకారమే కాల్పులు జరిపినట్లు పోలీసులు వెల్లడించారు. అర్ధరాత్రి 2 గంటల తర్వాత బయట కాల్పులు జరిపేందుకు ప్లాన్ చేశారు. కానీ ఇంటి బయట కాల్పులు జరిపితే దొరికిపోతామని భావించిన విక్రమ్‌గౌడ్.. ఇంట్లోనే కాల్పులు జరిపేందుకు నిశ్చయించుకున్నాడు.

విక్రమ్‌గౌడ్‌పై కాల్పులు జరిపింది సుపారి గ్యాంగ్ 1గా పోలీసులు గుర్తించారు. తనపై కాల్పులు జరిపేందుకు ముగ్గురితో విక్రమ్ ఒప్పందం చేసుకున్నాడు. ఒప్పందం చేసుకున్న ముగ్గురు అనంతపురంకు చెందినవారు. ఈ ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడింది. ప్రస్తుతం విక్రమ్‌గౌడ్ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉంది.

- Advertisement -