రాజ్యసభ సభ్యులు ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా వికారాబాద్ జిల్లా ఎస్‌పి యం. నారాయణ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ రోజు మొక్కలు నాటడం సంతోషంగా ఉంది. ముఖ్యమంత్రి కెసిఆర్ తెలంగాణలో హరిత హరం కార్యక్రమం చేపట్టడం వల్ల ప్రతి గ్రామంలో మరియు పట్టణాల్లో పచ్చదనంతో కళకళలాడుతున్నాయి. ఆహ్లాదాన్ని పంచుతున్నాయి.
ఈ క్రమంలో పల్లెలకు ప్రాధాన్యానికి హరితహారం ఇప్పటి వరకు రోజు వారీగా 200 వందల మొక్కలు నాటడం జరిగింది. నస్కల్ మరియు పెద్దేముల్ గ్రామం నందు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ ప్రతిష్టాత్మకంగా తీసుకొని ముందుకు తీసుకెళ్లాలని మరియు ఇంత అద్భుతమైన కార్యక్రమన్ని ముందుకు తీసుకొచ్చిన ఎంపీ సంతోష్ కుమార్‌కి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. అడవులను దత్తత తీసుకునే కార్యక్రమం అద్భుతమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో డిఎస్‌పి పరిగి శ్రీనివాస్, డిఎస్‌పి తాండూర్ లక్ష్మినారాయణ, పరిగి సీఐ లక్ష్మి రెడ్డి, మరియు తాండూర్ రూరల్ సీఐ జలెంధర్ రెడ్డి పాల్గొన్నారు.