సూపర్‌ స్టార్ మహేష్‌పై మంచు హీరో కామెంట్స్‌..!

44
mahesh

టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు గ్లామర్‌ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవల్సిన అవసరం లేదు. మహేష్‌ రోజు రోజుకు యంగ్ బాయ్‌లా మారిపోతున్నారు. తాజాగా ఈ విషయం గురించి మరో హీరో మంచు విష్ణు స్పందించారు. మహేష్‌,విష్ణు కలిసి దిగిన ఓ ఫొటోను మంచు విష్ణు ట్విట్టర్‌ ద్వారా పంచుకున్నారు. ఈ షోటో పోస్ట్‌ చేసి మహేష్‌ బాబుపై పొగడ్తల జల్లు కురిపించారు విష్ణు.

కాగా ఆ ఫొటోలో మంచు విష్ణు, వెరానికా, మహేశ్ బాబు, నమ్రత ఉన్నారు. ఈ ఫొటోలో ఒక వ్యక్తి రోజురోజుకు అందంగా తయారవుతున్నాడని, మరింత కుర్రాడిగా మారిపోతున్నాడని విష్ణు పేర్కొన్నారు.అయితే, అతనంత యంగ్ గా కనిపించడానికి అతడి మంచి మనసు, సత్ప్రవర్తనే కారణమని బలంగా నమ్ముతున్నానని వివరించారు.

విష్ణు వ్యాఖ్యలపై మహేష్‌ కూడా స్పందించారు. గత రాత్రి అద్భుతంగా గడిచిందని, తమకు ఎంతో గొప్పగా ఆతిథ్యం ఇచ్చారంటూ మంచు విష్ణు దంపతులకు కృతజ్ఞతలు తెలియజేశారు ప్రిన్స్‌.ఇక మహేష్ ప్రస్తుతం సర్కారు వారి పాట చిత్రంలో నటిస్తుండగా.. మంచు విష్ణు మోసగాళ్లు మూవీలో నటిస్తున్నారు.