టీకా రాజ‌ధానిగా హైద‌రాబాద్: మంత్రి కేటీఆర్‌

145
ktr minister
- Advertisement -

ఈ రోజు అంబర్ పేట నియోజకవర్గంలోని తిలక్ నగర్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. రాష్ర్టంలో 140 కేంద్రాల్లో క‌రోనా వ్యాక్సినేష‌న్ ప్రారంభ‌మైంద‌ని తెలిపారు. తొలుత ఫ్రంట్ లైన్ వారియ‌ర్స్‌కే టీకా ఇస్తున్నారు. ప్ర‌ధాని మోదీ సూచ‌న మేర‌కు ప్ర‌జాప్ర‌తినిధులు ప్ర‌స్తుతం టీకా తీసుకోవ‌డం లేద‌న్నారు. ప్ర‌జ‌ల‌తో పాటు ప్ర‌జాప్ర‌తినిధులు టీకా తీసుకుంటారు. కొవాగ్జిన్ టీకా హైద‌రాబాద్‌లో త‌యారు కావ‌డం గ‌ర్వ‌కార‌ణంగా ఉంద‌న్నారు.

సుర‌క్షిత‌మైన టీకాల‌ను హైద‌రాబాద్ న‌గ‌రం ప్ర‌పంచానికి అందిస్తుంద‌ని తెలిపారు. ప్ర‌పంచంలో వినియోగించే ప్ర‌తి మూడు వ్యాక్సిన్‌ల‌లో ఒక వ్యాక్సిన్ హైద‌రాబాద్ నుంచి ఉత్ప‌త్తి అయిందే ఉంటుంద‌ని పేర్కొన్నారు. టీకాల ఉత్ప‌త్తిలో ప్ర‌పంచానికి టీకా రాజ‌ధానిగా హైద‌రాబాద్ మారింద‌న్నారు. టీకాతో క‌రోనా మ‌హ‌మ్మారి నుంచి ప్ర‌జ‌లంతా బ‌య‌ట‌ప‌డుతార‌ని ఆశిస్తున్నాన‌ని చెప్పారు. టీకా విష‌యంలో ఎవ‌రూ భ‌య‌ప‌డాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు. ప్రాధాన్య‌త క్ర‌మంలో అంద‌రికీ టీకాలు వేస్తార‌ని కేటీఆర్ గారు స్ప‌ష్టం చేశారు. 

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీ ముఠా గోపాల్ గారు, మేయర్ శ్రీ బొంతు రామ్మోహన్ గారు, కలెక్టర్ శ్రీమతి శ్వేతామహంతి గారు, సీపీ శ్రీ అంజనీ కుమార్ గారు, ఇతర ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు, వైద్యులు, పలువురు నాయకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -