ఓటర్ల జాబితా సవరణ కొనసాగుతోందన్నారు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్. వచ్చే నెలలో 3, 4, 5 తేదీల్లో ఈసీ తెలంగాణ పర్యటిస్తుందన్నారు. కేంద్రం, రాష్ట్రంకు చెందిన 20 ఏజెన్సీలతో సమావేశాలు ఉంటాయన్నారు. 18 ఏళ్లు నిండిన వారిని ఓటర్లుగా చేరుస్తున్నం అని…జనవరి నుంచి ఇప్పటి వరకు కొత్తగా 15 లక్షల మంది ఓటర్లుగా చేరారన్నారు.
బోగస్ ఓట్లపై పిర్యాదులు వస్తున్నాయి…. మేము పారదర్శకంగా ఓటర్ల జాబితాను తయారు చేస్తాం అన్నారు.3.38 లక్షల మందిని ఓటర్ల జాబితా నుంచి తొలగించామని…తుది ఓటర్ల జాబితా తర్వాత జిల్లాలో సిబ్బందికి శిక్షణ ఉంటుందన్నారు. ఈవీఎంల చెకింగ్ జరుగుతుందని…రాష్ట్ర ఎన్నికలకు రెండు, మూడు నెలలు నుంచి ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. మేం మా షెడ్యూల్ ప్రకారం ఏర్పాట్లు చేసుకుంటూ వెళ్తున్నాం…రాష్ట్ర ఎన్నికల షెడ్యూలను ఈసీ ఖరారు చేస్తుందన్నారు.
Also Read:ఛాన్సుల్లేక మిడ్ నైట్ పార్టీల్లో నిధి