మొక్కలు నాటిన వికారాబాద్ ఎస్పీ నారాయణ

29
police

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ 3వ విడతలో భాగంగా హరితహారం కి మద్దతుగా శనివారం సాయత్రం వికారాబాద్ లో మొక్కలు నాటారు జిల్లా ఎస్పీ నారాయణ.

ఈ సందర్భంగా ఎస్పీ గారు సీఎం కేసీఆర్ గారు చేపట్టిన హరితహారం భారతదేశానికి ఒక ఆదర్శమైన కార్యక్రమం , దీనికి తోడు గా ఎంపీ సంతోష్ కుమార్ గారు చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఎంతో ప్రజాదరణ వచ్చేలా చేసింది అని, మనం వాతావరణం పరిరక్షణ కోసం ఆలోచించి చేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారని చెప్పారు.

వాతావరణం లో వచ్చే మార్పులను , హెచ్చు తగ్గులను సమతుల్యం చెయ్యాలి అంటే మనం విరివిగా మొక్కలు నాటాలి . ఈ సందర్బంగా రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారిని ప్రత్యేకంగా అభినందించారు .మరో ముగ్గురుని జిల్లా కలెక్టర్ గారు , స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ ఆనంద్ మెతుకు గారు మరియు అడిషనల్ ఎస్పీకి ఛాలెంజ్ విసిరారు .