మర్డర్ మూవీపై కేసు…స్పందించిన ఆర్జీవీ

67
murder movie

వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరో సంచలన కథను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. సూర్యపేటకు చెందిన అమృత ప్రణయ్ ల లవ్ స్టోరీ ఆధారంగా మర్డర్ మూవీ తెరకెక్కిస్తుండగా ఇప్పటికే ఫస్ట్ లుక్‌లతో అందరి అటెన్షన్‌ని తనవైపుకు తిప్పుకున్నాడు.

అయితే ఆర్జీవీ మూవీపై అభ్యంతరం తెలుపుతూ ప్రణయ్ తండ్రి బాలస్వామి….నల్గొండ ఎస్సీ,ఎస్టీలో కేసులో పిటిషన్ దాఖలు చేయగా ఆర్జీవీపై కేసు నమోదుచేయాలని పోలీసులకు ఆదేశాలు ఇచ్చింది న్యాయస్ధానం.

దీనిపై స్పందించిన రామ్ గోపాల్ వర్మ …చట్టపరంగానే తాను ముందుకు వెళ్తానని తెలిపారు. మ‌ర్డ‌ర్ సినిమాలో ఎవ‌రిని కించ‌ప‌ర‌చ‌డం, ఏ కులాన్ని ప్ర‌స్తావించ‌డం చేయ‌లేదని…వాస్తవ సంఘటన ఆధారంగా మాత్రమే సినిమా చేస్తున్నానని చెప్పుకొచ్చారు.